హరీష్ శంకర్ కి మండే ప్రశ్న వేసాడు.. బుక్ అయ్యాడు!!

దర్శకుడు హరీష్ శంకర్ కి కాస్త కోపమెక్కువే. డీజే సినిమా టైం లో రివ్యూస్ ఇవ్వని వెబ్ సైట్ ఓనర్లు కి ఇప్పటికి కౌంటర్లు వేస్తూనే ఉన్తది [more]

Update: 2020-09-06 07:50 GMT

దర్శకుడు హరీష్ శంకర్ కి కాస్త కోపమెక్కువే. డీజే సినిమా టైం లో రివ్యూస్ ఇవ్వని వెబ్ సైట్ ఓనర్లు కి ఇప్పటికి కౌంటర్లు వేస్తూనే ఉన్తది హరీష్. అయితే తాజాగా ఓ ఛానల్ యాంకర్ కి హరీష్ శంకర్ చమట్లు పట్టించాడు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చెయ్యడం దగ్గరనుండి పవన్ బర్త్ డే రోజున పోస్టర్ హంగామా వరకు చాల బిజీగానే ఉన్నాడు. అయితే పవన్ తో హరీష్ సినిమా అనగానే ఆ సినిమాపై పిచ్చ క్రేజ్ వచ్చేసింది. తాజాగా ఓ ఛానల్ హరీష్ శంకర్ ని ఇంటర్వ్యూ చేసింది. సదరు యాంకర్ హరీష్ శంకర్ ని బోలెడన్ని ప్రశ్నలు అడగడమే కాదు.. పవన్ కళ్యాణ్ తో సినిమాపై ఆయన రాజకీయాలపై ప్రశ్నలు వేసాడు.

అందులో భాగంగానే.. పవన్ కళ్యాణ్ తో మీరు చెయ్యబోయే సినిమా ఎలా ఉంటుంది అంటే.. అందరికి నచ్చేలా…. మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగించేలా ఉండబోతుంది అని చెప్పడమే కాదు పవర్ స్టార్ తో ఈసారి బొమ్మ దద్దరిల్లిపోవడమే అని చెప్పాడు. ఇక సదరు యాంకర్ కాస్త ఉత్సాహం గా పవన్ తో సినిమా చేస్తున్నారు కదా.. పవన్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు దానికి మీ స్పందన ఏమిటి అని అడగ్గానే మండిన హరీష్ శంకర్ మీరు వృథాప్రయాస తో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. సినిమా దర్శకుడిని సినిమాల గురించి అడగాలి.. రాజకీయాల గురించి కాదు.. నేనేమైనా రాజకీయనాయకుడిన? లేదా  మీ చానెల్ ఎండీనా? మీరు వేసే ప్రశ్న ఏమిటి? నేను ఎందుకు సమాధానం చెప్పాలంటూ యాంకర్ కి దిమ్మతిరిగే సమాధానం చెప్పి చమట్లు పట్టించాడు.

Tags:    

Similar News