హరీష్ శంకర్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?

Update: 2018-11-20 08:09 GMT

సినీ ఇండస్ట్రీలో ఎన్నో అంచనాల మధ్య స్టార్ట్ అయిన సినిమాలు గుమ్మ‌డికాయ కొట్ట‌క‌ముందే ఆగిపోయాయి. కొన్ని అనౌన్స్ చేసినవి సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగిపోయాయి. మన తెలుగులో ఆలా చాలా సినిమాలు ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ 'దాగుడుమూత‌లు' అనే పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను రాసుకున్నాడు. దానికి సంబంధించి స్క్రిప్ట్ మొత్తం కూడా రెడీ చేసుకుని సాయి ధరమ్ తేజ్, శ‌ర్వానంద్‌, నాని వంటి హీరోలకు వినిపించాడు. అయితే వారు ఎవరూ ఈ సబ్జెక్టుపై అంతగా ఆస‌క్తిని చూపించ‌లేద‌ని చెబుతారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆలా సెట్స్ మీదకు వెళ్లకుండానే తొలి దశలో ఆగిపోయింది.

తమిళ రీమేక్ తో దిల్ రాజు వద్దకు

అయితే హరీష్ శంకర్ చేసేది ఏమి లేక మరో సినిమా కథతో దిల్ రాజు దగ్గరకు వెళ్లాడు. ఈసారి తమిళ సినిమా కథతో వెళ్లాడు. తమిళంలో కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సిద్దార్థ్‌, ల‌క్ష్మీమీన‌న్‌, బాబీ సింహా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'జిగ‌ర్తాండ' రీమేక్‌ చేద్దాం అని దిల్ రాజుని అప్రోచ్ అయ్యాడట హరీష్. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా దిల్ రాజుకు నచ్చడంతో ఓకే చెప్పేశాడట. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని హరీష్ శంకర్ కు సూచించాడు.

దిల్ రాజు అసంతృప్తి...

స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి దిల్ రాజు దగ్గరకు వెళ్తే అంత సంతృప్తిగా లేడ‌ని అంటున్నారు. ఇప్పటికే హరీష్ ఈ స్క్రిప్ట్ కు సంబంధించి చాలా వెర్ష‌న్స్ సిద్ధం చేశాడ‌ట. కానీ అందులో ఏమీ రాజుకి నచ్చలేదట. దాంతో 'జిగ‌ర్తాండ' రీమేక్ ప‌ట్టాలెక్కుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి హరీష్ శంకర్ దిల్ రాజుని కాదని వేరే బ్యానర్ లోకి వెళ్లి ఈ సినిమా చేస్తాడేమో చూడాలి.

Similar News