వాల్మీకి కోసం మరో యంగ్ హీరో?

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి ఈ నెల 20 న విడుదల కాబోతుంది. తమిళ జిగర్తాండ కి రీమేక్ గా వస్తున్న [more]

Update: 2019-09-05 05:10 GMT

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వాల్మీకి ఈ నెల 20 న విడుదల కాబోతుంది. తమిళ జిగర్తాండ కి రీమేక్ గా వస్తున్న వాల్మీకి సినిమా మీద మంది అంచనాలే ఉన్నాయి. వరుణ్ తేజ్ మాస్ లుక్, పూజ హెగ్డే లంగా ఓణీ లో పల్లెటూరి లుక్స్ అన్ని సినిమా మీద మంచి ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మరో తమిళ హీరో కూడా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్స్ లో ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటిలో మెగా అభిమానులున్నారు. ఇక వాల్మీకి అసలైతే ఈ నెల 13 నే విడుదల కావాల్సి ఉంది. కానీ నాని గ్యాంగ్ లీడర్ కోసం వాల్మీకి వెనక్కి వెళ్ళింది.

ఇక పోస్టర్స్ తో టీజర్ తో సాంగ్స్ తో సినిమా మీద అంచనాలు పెరుగుతుంటే.. లేటెస్ట్ గా బయటికొచ్చిన న్యూస్ తో సినిమా మీద మరింత హైప్ పెరిగేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే న్యూస్ తాజాగా సోషల్ మీడియాలో వినబడుతుంది. తమిళ జిగర్తాండ లో ఓ హీరో తో గెస్ట్ రోల్ ప్లే చేయిస్తున్నట్టుగా…. వాల్మీకి లోను ఓ హీరో గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోల్ కోసం నితిన్ సంప్రదించగా నితిన్ ఒప్పుకున్నాడని తెలుస్తుంది. మరి నితిన్ రాకతో ఈ వాల్మీకి పై మరింత హైప్ పెరగడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News