రీమేక్ స్పెషలిస్ట్ కి చిరు ఆ ఛాన్స్ ఇస్తాడా?

టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ హారీష్ శంకర్. ఏ రీమేక్ అయినా.. తన స్టయిల్లో రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు. అయితే [more]

Update: 2020-02-17 11:42 GMT

టాలీవుడ్ లో రీమేక్ స్పెషలిస్ట్ హారీష్ శంకర్. ఏ రీమేక్ అయినా.. తన స్టయిల్లో రీమేక్ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు. అయితే ఒరిజినల్ కథలకన్నా రీమేక్ లే హరీష్ ని ఎక్కడో కూర్చోబెట్టాయి. తాజాగా రీమేక్ సబ్జెక్టు ద్వారానే పవన్ కళ్యాణ్‌తో కలిసి హరీష్ శంకర్ ‘సేఫ్’ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చినప్పుడు…. హరీష్ ఆ పుకార్లకు చెక్ పెట్టాడు. అయితే దబాంగ్, జిగర్తాండా వంటి ఒరిజినల్ సినిమాలను పక్కాగా రీమేక్ చేసి.. హీరో ఇమేజ్ కి తగినట్లుగా స్క్రిప్ట్‌ను మార్చడమే కాదు… నేటివిటీ తగినట్లుగా రీమేక్ చేసి గబ్బర్ సింగ్ మరియు వాల్మీకి వంటి సినిమాలను సూపర్‌హిట్‌లుగా మలిచాడు. అందుకే పవన్ సినిమా కూడా రీమేక్ అనుకున్నారు. కానీ హరీష్ ఖండించాడు.

తాజాగా హరీష్ శంకర్ పై మరో పుకారు ఫిలింనగర్ లో షికారు చేస్తుంది. అదేమంటే రీమేక్ ని పర్ఫెక్ట్ గా చెయ్యగల హరీష్ తో రామ్ చరణ్ – చిరంజీవి కలిసి లూసిఫెర్ సినిమా రీమేక్ చెయించాలని అనుకుంటున్నారని అంటున్నారు. చరణ్ లూసిఫెర్ హక్కులను చిరు కోసం కొని అట్టిపెట్టాడు. మధ్యలో సుకుమార్ రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ సుకుమార్ ఆ సినిమా విషయంలో మాట్లాడలేదు. తాజాగా హరీష్ శంకర్ పేరు లూసిఫెర్ రీమేక్ విషయంలో బాగా వినబడుతుంది. సుకుమార్ రీమేక్ చేస్తాడని వస్తున్న వార్తల నేపథ్యంలో, హరీష్ కి ఆ రీమేక్ చెక్కే పనిని అప్పగించారా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Tags:    

Similar News