హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?

డీజే సినిమా తర్వాత బోలెడంత టైం తీసుకున్న దర్శకుడు హారిష్ శంకర్… ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలెవరు అవకాశాలు ఇవ్వకపోయేసరికి.. మెగా హీరో వరుణ్ తేజ్ [more]

Update: 2019-11-16 09:39 GMT

డీజే సినిమా తర్వాత బోలెడంత టైం తీసుకున్న దర్శకుడు హారిష్ శంకర్… ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలెవరు అవకాశాలు ఇవ్వకపోయేసరికి.. మెగా హీరో వరుణ్ తేజ్ ని వాల్మీకి సినిమా కథతో పడేసి…. వరుణ్ తేజ్ ని మాస్ హీరో కింద చూపెట్టి హిట్ కొట్టాడు. హరీష్ శంకర్ కాకపోతే తమిళ రీమేక్ తో హిట్ కొట్టాడు. గతంలో దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ తో దుమ్మురేపిన హరీష్ ఇప్పుడు వాల్మీకి తో భారీ హిట్ సొంతం చేసుకోవడంతో… ఇప్పుడు నిర్మాతల దృష్టి హరీష్ పై పడింది. వాల్మీకి హిట్ తర్వాత హరీష్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. అయితే హరీష్ మాత్రం ఈసారి రీమేక్ కాదు… కొత్త గా ఫ్రెష్ కథతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట.

అందుకే కథని ప్రిపేర్ చేసుకుంటున్నాడట. కాకపోతే ఆ కథ స్టార్ హీరోలకు మాత్రమే అంటున్నాడని వినికిడి. ఇక నిర్మాతలు అడిగారు కదా అని హడావుడిగా ఏదో ఒక ప్రాజెక్ట్ సైన్ చేసేయకుండా నిదానంగా ఆలోచిస్తు.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హరీష్ కసరత్తులు చేస్తున్నాడట. మరి ఈసారి హరీష్ గాలానికి ఖచ్చితంగా స్టార్ హీరో తగలక తప్పదని అంటున్నారు. కాకపోతే స్టార్ హీరోలతో హరీష్ కి డేట్స్ కావాలంటే హరీష్ శంకర్ దాదాపుగా ఓ ఏడాది ఆగాల్సిందే. ఎందుకంటే స్టార్ హీరోలంతా ఏదో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి

Tags:    

Similar News