జులై 21న ‘ప్రీ వెడ్డింగ్’

Update: 2018-07-17 11:52 GMT

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌... అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టు తో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్లగా తెలుగు తెర‌కి పరిచ‌య‌మై సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహ‌రిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపి వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. లక్ష్మ‌ణ్ కార్య దర్శకుడు. ఈ నెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ట్రైలర్ కు మంచి స్పందన

శక్తికాంత్ మ్యూజిక్, ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ రీ రికార్డింగ్ అద్భుతంగా అందిస్తున్నారు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ చిత్ర కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని జులై 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిత్రంలో న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌జ‌, మ‌ధుమ‌ణి త‌దిత‌రులు.

Similar News