హను పని అవుట్ అన్నట్లేనా..?

దర్శకుడు హను రాఘవపూడి ఇప్పటివరకు ఒక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోలేదు. ఆయన ప్రేమ కథా చిత్రాలు మంచి ఫీల్ గుడ్ మూవీస్ లా ఉంటాయంటారు. కానీ [more]

Update: 2018-12-25 06:18 GMT

దర్శకుడు హను రాఘవపూడి ఇప్పటివరకు ఒక్క బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోలేదు. ఆయన ప్రేమ కథా చిత్రాలు మంచి ఫీల్ గుడ్ మూవీస్ లా ఉంటాయంటారు. కానీ ఆ సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు లేవు. గత ఏడాది లై సినిమాతో డిజాస్టర్ కొట్టిన హను రాఘవపూడి ఈ ఏడాది పడి పడి లేచే మనసుతో మళ్లీ యావరేజ్ అందుకున్నాడు. కానీ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఆయన మొదటి సినిమా అందాల రాక్షసి దగ్గర నుండి అదే వరస. రెండో సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా హిట్ అన్నప్పటికీ యావరేజ్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకుంది. తాజాగా పడి పడి లేచే మనసు కూడా యావరేజ్ టాక్ తో యావరేజ్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా కాస్త బాగున్నప్పటికీ… సెకండ్ హాఫ్ తట్టుకోవడం కష్టంగా ఉందని ప్రేక్షకులే చెబుతున్నారు.

రొటీన్ కథ కావడంతో…

శర్వానంద్, సాయి పల్లవిల నటన సూపర్ గా ఉన్నప్పటికీ… సినిమా కథ రొటీన్ కావడం వలన సినిమా హిట్ అవ్వలేకపోయింది. ఇక హను రాఘవపూడి లై సినిమా డిజాస్టర్ అప్పుడే… ఆయనికి దర్శకుడిగా రోజులు చెల్లాయేమో అనుకుంటే… శర్వానంద్ హను ని నమ్మి మళ్లీ అవకాశమిచ్చారు. అయితే హను రాఘవపూడి మంచి మాస్ మసాలా కథతో వస్తే శర్వానంద్ మాత్రం లవ్ స్టోరీ చేద్దామని చెబితే హను లవ్ స్టోరీతో సినిమా చేసి శర్వాకి యావరేజ్ ఇచ్చాడు.

నాని ఛాన్స్ ఇస్తాడా..?

మరి ఇప్పుడు కూడా ఈ దర్శకుడికి ఛాన్స్ లు వచ్చే ఛాన్స్ ఉందంటారా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే శర్వానంద్ తర్వాత నేచురల్ స్టార్ నానితో ఆయన సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ ఇప్పుడు నాని ఛాన్స్ ఇస్తాడని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం జెర్సీ సినిమా చేస్తున్న నాని, విక్రమ్ కుమార్ తో మరో సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ విక్రమ్ కుమార్ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధానికి కానీ పూర్తి కాదు.. ఈ లోపు నాని హనుని హోల్డ్ లో పెట్టినా పెట్టొచ్చు. తర్వాత మరో దర్శకుడికి కమిట్ అయినా అవ్వొచ్చని టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.

Tags:    

Similar News