అల్లు అర్జున్ భద్ర చేసుంటే…!!

భద్ర సినిమాతో టాలీవుడ్ కి ఓ మాస్ దర్శకుడు పరిచయం అయ్యాడు. రవితేజ – బోయపాటి కలయికలో తెరకెక్కిన భద్ర మూవీ సూపర్ హిట్ అవడంతో బోయపాటి [more]

Update: 2020-05-13 05:51 GMT

భద్ర సినిమాతో టాలీవుడ్ కి ఓ మాస్ దర్శకుడు పరిచయం అయ్యాడు. రవితేజ – బోయపాటి కలయికలో తెరకెక్కిన భద్ర మూవీ సూపర్ హిట్ అవడంతో బోయపాటి కి స్టార్ హీరోల ఛాన్స్ లు అలవోకగా వచ్చి పడ్డాయి. రవితేజ అల్లరిగా, మాస్ లుక్ లో చేసిన యాక్షన్, బోయపాటి పవర్ ఫుల్ డైలాగ్స్ అన్ని భద్ర సినిమా హిట్ కి దోహద పడ్డాయి. మీరా జాస్మిన్ ఎమోషనల్ అండ్ అల్లరి నటన, ప్రకాష్ రాజ్ నటన అన్ని సినిమాని ఎక్కడో నిలుచునేలా చేసాయి. అయితే భద్ర సినిమా కథ మొదట రవితేజ కోసం రాసుకోలేదట. బోయపాటి భద్ర కథని మెగా హీరోగా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న బన్నీ ని మనసులో పెట్టుకుని రాసుకోవడమే కాదు.. భద్ర కథ ని బోయపాటి బన్నీకి వినిపించాడట కూడా.

అయితే అప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి.. గంగోత్రి, ఆర్య సినిమాలు మాత్రమే చేసిన అల్లు అర్జున్ బోయపాటి తో భద్ర సినిమా చేసేందుకు వెనకాడదట. మాస్ మసాలా అంశాలున్నా కథతో కెరీర్ తొలినాళ్లలోనే సినిమా చేస్తే ఇబ్బందిపడాల్సి వస్తుంది అని బన్నీ డ్రాప్ అయ్యాడట. కానీ బోయపాటిని బన్నీ దిల్ రాజుకి పరిచయం చెయ్యగా.. దిల్ రాజుకి బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో భద్ర సినిమా రవితేజ హీరోగా పట్టాలెక్కింది. మరి రవితేజ భద్ర గా అదరగొట్టేసాడు. అదే భద్ర పాత్రలో బన్నీ ని ఊహించుకుంటే.. మెగా ఫాన్స్ కి పూనకాలే. కాకపోతే బన్నీ వెనకడుగు వెయ్యడంతో.. భద్ర మిస్ అయ్యాడన్నమాట. మరి బోయపాటి – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సరైనోడు టాప్ లేపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News