లాక్ డౌన్ లో మరో స్టార్ జంట పెళ్లి!

తమిళ హీరో విష్ణు విశాల్ – టెన్నిస్ స్టార్ గుత్తా జ్వాలా ప్రేమాయణం అందరికి తెలిసిందే. మొన్నామధ్యన గుత్తా జ్వాలా – విష్ణు విశాల్ లు ఎంగేజ్మెంట్ [more]

Update: 2020-12-13 16:22 GMT

తమిళ హీరో విష్ణు విశాల్ – టెన్నిస్ స్టార్ గుత్తా జ్వాలా ప్రేమాయణం అందరికి తెలిసిందే. మొన్నామధ్యన గుత్తా జ్వాలా – విష్ణు విశాల్ లు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న విషయం ఆ జంట బయటపెట్టింది. గుత్తా జ్వాలా ఆట కన్నా ఎక్కువ కాంట్రవర్సీలతోనే హైలెట్ అయ్యింది. కోచ్ పుల్లెల గోపీచంద్ విషయంలో రచ్చకెక్కిన జ్వాలా గుత్తా ప్రేమ, పెళ్లి విషయంలోనూ అంతే హైలెట్ అయ్యింది. చేతన్ ఆనంద్ తో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత చాలా రోజులకి గుత్తా జ్వాలా తమిళ హీరో విష్ణు విశాల్ ప్రేమలో పడింది. చాన్నాళ్లు సీక్రెట్ గా మైంటైన్ చేసిన వాళ్ళ ప్రేమ సడన్ గా సోషల్ మీడియాకెక్కింది. అయితే మొన్నామధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్న గుత్తా జ్వాలా – విష్ణు విశాల్ లు పెళ్ళికి రెడీ అయ్యారు. మధ్యలో గుత్తా జ్వాలా టెన్నిస్ అకాడమీ స్టార్ట్ చెయ్యడం.. దానికోసం హడావిడి చెయ్యడం జరిగింది. అయితే గుత్తా జ్వాలా పెళ్లి విషయం, పెళ్లి డేట్ విషయం మాత్రం ఎక్కడా వినబడలేదు.

అసలు వాళ్ళ పెళ్లి విషయమై మీడియాకి ఎలాంటి సమాచారం లేదు. ఆమె టెన్నిస్ అకాడెమీ స్టార్ట్ చెయ్యడం, దానిపై ఇంటర్వ్యూ లు చెయ్యడం తప్ప ఆమె పెళ్లి విషయమే ఎవరూ మాట్లాడలేదు. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ప్రస్తుతం గుత్తా జ్వాలా మెహిందీ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఆ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో గుత్తా జ్వాలా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలిసి అందరూ షాకవుతున్నారు. అసలు గుత్తా కానీ, విష్ణు కానీ తమ పెళ్లి విషయాన్ని ఇప్పటివరకు సీక్రెట్ గా దాచి ఇప్పుడు రివీల్ చేయడం కాస్త ఆశ్చర్యకర విషయమే. లాక్ డౌన్ లో చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి పీటలెక్కినట్టుగానే జ్వాలా గుత్తా – విష్ణు విశాల్ లు కూడా ఓ ఇంటివారు కాబోతున్నారు.

Tags:    

Similar News