బ్రహ్మానందానికి ‘గురుశ్రీ’

Update: 2018-09-04 11:37 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో స్టార్ గా మారిన కమెడియన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు.. బ్రహ్మానందం. ఇప్పటికే వెయ్యికి పైగా సినిమాల్లో నటించి, ప్రేక్షకులను నవ్వించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయనను శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ''గురు శ్రీ'' పురస్కారంతో సన్మానించింది. ఈ సందర్బంగా ఆయనకు బంగారు కంకణాన్ని తొడిగారు. గత 20 ఏళ్లుగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా చెన్నై లో జరిగిన కార్యక్రమంలో బ్రహ్మానందం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ... ‘‘తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకే దేవుడు నన్ను పంపించాడు. అందుకే నేను మిమ్మల్ని నవ్విస్తున్నాను. మీ ఆదరాభిమానాలు ఉన్నంత వరకు మిమ్మల్ని నవ్వించే పనిలోనే ఉంటాను’’. అని వ్యాఖ్యానించారు.

Similar News