‘గల్లీ బాయ్’ రీమేక్ షురూ..!

బాలీవుడ్ లో ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హావా నడుస్తోంది. ఆయన నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా [more]

Update: 2019-02-18 07:16 GMT

బాలీవుడ్ లో ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ హావా నడుస్తోంది. ఆయన నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఇక లేటెస్ట్ గా ఈ నెల 14న విడుదలైన ‘గల్లీ బాయ్’ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. అలియా భట్ కథానాయికగా నటించిన ఈ సినిమా 4 రోజుల్లో 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. యూనివర్సల్ కంటెంట్ కావడమే ఈ సినిమా అంతలా హిట్ అవ్వడానికి కారణం. ఒక మనిషి అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు అని ఈ సినిమాతో నిరూపించాడు రణ్ వీర్. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ కావడంతో రీమేక్ చేయడానికి ఇతర భాషల చిత్ర నిర్మాతలు చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

సొంతం చేసుకున్న అల్లు అరవింద్

ఈ లిస్ట్ లో తెలుగు నుంచి అల్లు అరవింద్ ఉన్నారు. ఆయన రీసెంట్ గా ఈ సినిమాను చూసి రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నట్టు టాక్. ఈ మూవీ తెలుగులో సాయి ధరమ్ తేజ్ తో గానీ లేదా అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో గానీ తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు అల్లు అరవింద్. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి. త్వరలోనే ఈ విషయాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News