‘గూఢచారి’ డైరెక్టర్ తర్వాత సినిమా కంఫర్మ్.!

Update: 2018-09-05 06:33 GMT

‘గూఢచారి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్క తన నెక్స్ట్ మూవీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అడివి శేష్ హీరోగా రూపొందిన ‘గూఢచారి’ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో కూడా మంచి జోరు కొనసాగిస్తూ కలెక్షన్స్ ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించిన అడివి శేష్ కి ఎంత పేరైతే వచ్చిందో ఆ సినిమాను డైరెక్ట్ చేసిన శశికిరణ్ కి కూడా అంతే పేరు వచ్చింది.

భారీ నిర్మాణ సంస్థలో...

అయితే ఈ నేపథ్యంలో శశి కిరణ్ తన తదుపరి చిత్రాన్ని పెద్ద బ్యానర్ లో చేయనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో శశి చేయనున్నాడు. అతను చెప్పిన కథ నిర్మాతలకి నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో హీరో, హీరోయిన్ ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణల గురించి త్వరలోనే వివరాలను ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ బ్యానర్ తెరకెక్కిన నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ విడుదలకు సిద్ధమవుతుంది.

Similar News