'గీత గోవిందం' భయంతో అమెరికాకు 'గూఢచారి'..!

Update: 2018-08-17 09:53 GMT

అడివి శేష్ హీరోగా ఈనెల 3న విడుదలైన 'గూఢచారి' చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా దూకుడు ఏమాత్రం తగ్గించలేదు. ఈ సినిమా అడివి శేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలుస్తుందంటున్నారు ట్రేడ్ వర్గాలు.

గీత గోవిందం రావడంతో

ఇక ఓవర్సీస్ 'గూఢచారి' 0.7మిలియన్ డాలర్లతో స్ట్రాంగ్ గా వుంది. త్వరలోనే వన్ మిలియన్ మార్కును దాటేస్తుంది అనుకున్నారు అంతా. కానీ ఈ లోపు విజయ్ దేవరకొండ 'గీత గోవిందం'తో దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జోరు కొనసాగిస్తుంది. అదే రేంజ్ లో ఓవర్సీస్ లో విజయ్ తన సత్తా చూపుతున్నాడు.

అమెరికా బాట పట్టిన టీం

దీంతో 'గూఢచారి' సినిమా వసూళ్లపై 'గీత గోవిందం' ఎఫెక్ట్ పడింది. ఈ నేపథ్యంలో 'గూఢచారి' టీం సినిమా కలెక్షన్స్ పెంచాలనే ఉద్దేశ్యంతో..టీం అంత ఈ రోజు అమెరికా టూర్ కి పయనం అయ్యారు. దాదాపు అక్కడ 10 రోజులపై ఉండి సినిమాను మరింత ప్రమోట్ చేయనున్నారు. అక్కడ న్యూ జెర్సీ, డెలాయిట్, డల్లాస్, చికాగో, సియాటెల్ ప్రాంతాల్లో టీం టూర్ ఉండబోతుంది.

Similar News