ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నానన్న సమంత !

Update: 2018-07-04 13:04 GMT

ఆడవి శేష్ 'గూఢచారి' సినిమా ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న‌ది. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి, మోడ‌ల్ శోభిత హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్స్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈరోజు హీరోయిన్ సమంత 'గూఢచారి' టీజర్ ను విడుదల చేసారు.

అందరినీ ఆకట్టుకునేలా సినిమా...

ఈ సందర్బంగా సమంత మాట్లాడుతూ... "టీజర్ చాలా బాగుంది. సినిమా హై బడ్జెట్ లో తీసినట్లు రిచ్ గా ఉంది. ఈ సినిమా టీజర్ ను లాంచ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. క్షణం సినిమా లాగే ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అందరిలాగే ఈ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా" అన్నారు. అడవిశేష్ మాట్లాడుతూ..."డైరెక్టర్ శశి ఈ సినిమాను గొప్పగా తెరకెక్కించారు. విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. 168 లొకేషన్స్ లో ఈ సినిమాను తీయడం జరిగింది. మంచి బడ్జెట్ ఇచ్చి మాకు సహకరించిన నిర్మాతలకు థాంక్స్. మా టీజర్ ను రిలీజ్ చేసిన సమంత కు స్పెషల్ థాంక్స్. గూఢచారి సినిమా ప్రేక్షకులను థ్రిల్ చెయ్యబోతోంది" అన్నారు.

నటీనటులు:

అడవి శేష్, శోభిత దులిపాళ్ల, ప్రకాష్ రాజ్, మధు షాలిని, అనిష్ కురివెల్ల, సుప్రియ యార్లగడ్డ, వెన్నెల కిషోర్, రాకేష్ వర్రి.

Similar News