మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్స్ సీజ్!

మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాదు వివిధ ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా [more]

Update: 2018-12-28 06:01 GMT

మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాదు వివిధ ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ కు ఊహించని షాక్ తగిలింది. మహేష్ కు జీఎస్టీ హైదరాబాద్ కమిషనరేట్ షాకిచ్చింది. గత 9 ఏళ్లుగా మహేష్ ఎగవేస్తున్న పన్ను బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతూ ఆయనకు నోటీసులు పంపింది. స్టార్ ఇమేజ్ ను సంపాందించిన మహేష్ కు ఇటువంటి నోటీసులు రావడం షాకింగే. ప్రమోషన్ కార్యక్రమాలు, బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన ప్రకటనలకు గాను లభించిన మొత్తంపై చెల్లించాల్సిన పన్నులు చెల్లించలేదని పేర్కొంది.

వెంటనే చెల్లించాలని నోటీసులు

అంతే కాదు మహేష్ బ్యాంకు అకౌంట్స్ సీజ్ చేసింది. 2007-2008 ఆర్థిక సంవత్సరానికి గాను మహేశ్ బాబు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని తెలిపింది. వడ్డీలు, పన్ను, జరిమానా రూపంలో మొత్తంగా 73.5 లక్షలు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొంది. మరి మహేష్ బాబు లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవుతాడో చూడాలి. ఫ్యాన్స్ కి ఇటువంటి న్యూస్ కొంచం ఇబ్బంది కలగొచ్చు. మహేష్ ఎందుకని టాక్స్ కట్టకుండా ఉన్నాడు అనేది తెలియాలి. తప్పు ఎక్కడ జరిగిందో మహేష్ కే తెలియాలి.

Tags:    

Similar News