జెర్సీ డైరెక్టర్ నెక్స్ట్ అతనితోనే..?

మళ్లీ రావా సినిమాతో సక్సెస్ అందుకుని… జెర్సీ సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హౌస్ [more]

Update: 2019-04-23 06:48 GMT

మళ్లీ రావా సినిమాతో సక్సెస్ అందుకుని… జెర్సీ సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. జెర్సీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అందుకే ఇప్పుడు చాలామంది నిర్మాతలు, హీరోలు ఈ డైరెక్టర్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తరువాత సినిమా ఎవరితో? ఏ బ్యానర్ లో అని ఎంక్వయిరీలు కూడా స్టార్ట్ అయ్యాయి.

పాత నిర్మాతతోనే…

గౌతమ్ నెక్స్ట్ మూవీ నిర్మాత కూడా ఎన్వీ ప్రసాద్ అని తెలిసింది. కారణం మొదటి సినిమా టైంలోనే ఎన్వీ ప్రసాద్ అడ్వాన్స్ ఇచ్చారు. కథ రెడీ అయితే హీరోలు దొరకడం పెద్ద కష్టమేమి కాదు. సక్సెస్ ఉన్న టైంలో పెద్ద హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు అంతా హిట్ కొట్టిన డైరెక్టర్ తోనే సినిమా చేద్దాం అనుకుంటున్నారు. గౌతమ్ దగ్గర కథ ఉంటే చాలు. కానీ గౌతమ్ ఇప్పటివరకు ఫలానా స్టోరీ అని ఏమీ అనుకోలేదట. ప్రస్తుతం అతను జెర్సీ సక్సెస్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు.

Tags:    

Similar News