నాని – గౌతమ్ మ్యాజిక్ చేశారు..!

నాని – గౌతమ్ తిన్నసూరి కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించిన జెర్సీ సినిమా సూపర్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. నాని సినిమా [more]

Update: 2019-04-22 08:16 GMT

నాని – గౌతమ్ తిన్నసూరి కాంబోలో సితార ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించిన జెర్సీ సినిమా సూపర్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. నాని సినిమా మొత్తం ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ పలికించిన భావోద్వేగాలకు ప్రేక్షకులు మైమరచిపోయారు. 2.30 గంటల పాటు ఎలాంటి బోర్ కలగకుండా గౌతమ్ తిన్నసూరి జెర్సీ సినిమాని తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులే కాదు టాప్ హీరోలు సైతం గౌతమ్ తిన్నసూరిని అభినందిస్తున్నారు. నాని – శ్రద్ద శ్రీనాధ్ రొమాంటిక్, ఎమోషనల్ జర్నీ కూడా జెర్సి సినిమా హిట్ కి ప్రధాన కారణమే. ఇక అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ జెర్సీ సినిమాకి ఆయువుపట్టు. మరి మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ తో కాస్త స్లోగా మొదలైన జెర్సీ కలెక్షన్స్ మొదటి వీకెండ్ ముగిసేసరికి అదుర్స్ అన్న రేంజ్ లో కనిపించాయి.

ఏరియా వీకెండ్ కలెక్షన్స్

నైజాం 4.92
సీడెడ్ 1.00
అర్బన్ ఏరియాస్ 1.31
ఈస్ట్ గోదావరి 0.86
కృష్ణ 0.77
గుంటూరు 0.82
వెస్ట్ గోదావరి 0.63
నెల్లూరు 0.36
ఏపీ, టీఎస్ 10.67 కోట్లు

Tags:    

Similar News