మళ్లీ కామెడీని నమ్ముకుంటున్న గోపీచంద్

డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో మరోసారి యాక్షన్ హీరో గోపిచంద్ ఓ సినిమా చేయనున్నాడు. కొన్నినెలల కిందట సంపత్ చెప్పిన లైన్ గోపీచంద్ కి బాగా [more]

Update: 2019-02-11 06:15 GMT

డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో మరోసారి యాక్షన్ హీరో గోపిచంద్ ఓ సినిమా చేయనున్నాడు. కొన్నినెలల కిందట సంపత్ చెప్పిన లైన్ గోపీచంద్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఇందులో గోపీచంద్ తో పాటు మరో ముఖ్యపాత్ర కూడా ఉందట. అందుకే ఆ పాత్ర కోసం కమెడియన్ సునీల్ ను తీసుకుందామని మేకర్స్ భావిస్తున్నారంట.

చాలా రోజులకు కామెడీ ఎంటర్టైనర్ తో

సునీల్ అయితే ఈ పాత్రకు న్యాయం చేయగలడు అని అనుకుంటున్నారు. గోపీచంద్ కామెడీ యాక్షన్ మూవీస్ చేసి చాలా ఏల్లవుతుంది. ‘లౌక్యం’ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు గోపీచంద్ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. గతంలో గోపీచంద్ – సంపత్ కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని ధీమాతో ఉన్నారు. మరి ఏం అవుతుందో చూద్దాం.

Tags:    

Similar News