పాపం గోపీచంద్

Update: 2018-07-06 02:56 GMT

గోపీచంద్ టైం అస్సలు బాగోలేదు. వరుస పరాజయాలను చవి చూస్తున్నాడు. గౌతంనందా, ఆక్సీజెన్, ఆరడుగుల బుల్లెట్టు ఇలా వరసగా గోపీచంద్ ప్లాప్ అవుతూ వస్తున్నాడు. మాస్ మాస్ అంటూ మాస్ కథల వెంట పడడంతోనే గోపీచంద్ కి ఇలా పరాజయాలు తప్పడం లేదు. ఏదో సినిమాలు చేస్తున్నాను.. అవి విడుదలవుతున్నాయి... నాకు విజయాలతో పనేం లేదు అన్నట్టుగాగా గోపీచంద్ కెరీర్ మారిపోయింది. నిన్నటికి నిన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పంతం సినిమా కూడా ఏ విధంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొత్త దర్శకుడు చక్రితో కలిసి చేసిన పంతం సినిమా కి ప్రేక్షకులు క్రిటిక్స్ కూడా కేవలం యావరేజ్ మార్కులే వేశారు. మెగ్రీన్ అందాలు, గోపీచంద్ నటన కూడా సినిమాని కాపాడలేకపోయాయి.

ఈ సినిమాలో కేవలం గోపీచంద్ నటన, కొన్ని ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే కోర్టులో చెప్పే డైలాగ్ తప్ప ఈ సినిమాలో ఇక మెప్పించే విధంగా ఎక్కడా కనబడలేదు. పంతం సినిమాలో పాటలు ఎందుకు పెట్టారో.. అవి ఎందుకు వచ్చి వెళుతున్నాయి కూడా చెప్పలేని చికాకు పుట్టించే పరిస్థితి. ఇక కథ ఎక్కడో చాలా సార్లు చూసేసినట్టుగా ఉండడం, హీరో, హీరోయిన్స్ మధ్య నడిచే ట్రాక్, ఏ విధంగా మెప్పించలేని మెసేజ్, పెట్టిన కామెడీ కూడా పేలకపోగా... అతిగా అనిపించడం.. ఇలా సినిమాకి ఇన్ని మైనస్ లుగా మారే సరికి ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు బోర్ ఫీల్ అవుతూనే ఉంటారు. మరి గోపీచంద్ కెరీర్ లో నిలిచిపోయేలా తన 25 సినిమా ఉండాలనుకుంటే.. నిజంగానే గోపీచంద్ కి మరిచిపోలేని టాక్ తో పంతం సినిమా థియేటర్స్ లో రన్ అవుతుంది.

ఇక పంతం కి ఎంతగా ప్రమోషన్స్ చేసారు అంటే... గోపీచంద్ ఏ సినిమాకి చెయ్యలేదు అన్నట్టుగా... మరి పంతం సినిమా కి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రావనే టాక్ వినబడుతుంది. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా తన తేజ్ ఐ లవ్ యు తో నేడు ప్రేక్షకుల ముందుకు దిగుతున్నాడు. ఒకవేళ తేజ్ ఐ లవ్ యు కి టాక్ లేచిందా ఇక గోపీచంద్ దుకాణం సర్దేయాల్సిందే. లేదు సాయి ధరమ్ తేజ్ కూడా సో సో పెరఫార్మెన్స్ తో ఉంటె గనక గోపీచంద్ గట్టెక్కేస్తాడు. అయినా ఇప్పటికైనా గోపీచంద్ ఆలోచించి కథలను, దర్శకులను సెట్ చేసుకుంటే కొన్నాళ్ళు హీరోగా నిలబడతాడు. లేదంటే మళ్లీ గోపీచంద్ ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Similar News