ఆలా చేయడం వల్లే `గూఢచారి ` హిట్ అయింది

Update: 2018-08-05 04:37 GMT

సినిమా మేకర్స్ కి తమ సినిమా ఎప్పుడు బాగుంటుందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాను అంతలా నమ్మి తీస్తారు కనుక. కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలనే సినిమాను తీస్తారు. కానీ దాని పరిస్థితి ఏంటో బయట చూసిన జనాలే డిసైడ్ చేస్తారు. అందుకే మన మేకర్స్ సినిమా యొక్క ఫీడ్ బ్యాక్ కోసం సినిమా రిలీజ్ కి ముందే కొంత‌మందికి చూపించ‌డం అల‌వాటు.

అలానే లేటెస్ట్ గా రిలీజ్ అయినా 'గూఢచారి'కీ అలాంటి ఫీడ్ బ్యాకే తీసుకున్నాడు అడ‌విశేష్‌. సినిమా రిలీజ్ కి ముందు దాదాపు వెయ్య మంది చూసారంట. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని సినిమా ఎక్కడ స్లో అవుతుంది..లాజిక్స్ ఎక్కడ మిస్ అవుతున్నాయి అన్న అంశాలపై ఆరా తీశాడట హీరో అడివి శేష్.

వాళ్ల అభిప్రాయాల‌కు విలువ ఇస్తూ రీషూట్లు కూడా చేసుకుంటూ వెళ్లాడు. ఇలా చేయడం వల్ల సినిమాకు మంచి రిపోర్ట్స్ వచ్చి బాగా ఆడుతుంది. ఈ సినిమాకి మెయిన్ అసెట్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ప‌రంగా సినిమా బాగుందని చూసిన ప్రతి ప్రేక్షకుడు చెబుతున్నాడు. ఆలా ముందుగానే జాగ్రత్త పడి సినిమా తీసి సక్సెస్ అయ్యారు. నిజానికి ఇలా సురేష్ బాబు చేస్తాడు. రిలీజ్ కి ముందే సినిమాను తన స్టూడియోలో ప్ర‌తీరోజూ నాలుగు షోలు ప‌డుతుంటాయి. ఎవ‌రెవ‌రో వెళ్లి సినిమా చూసొస్తుంటారు. వాళ్ల వాళ్ల అభిప్రాయాలు చెబుతుంటారు. దాని బట్టే చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను బయటకి రిలీజ్ చేస్తాడు. అలానే ఇప్పుడు అడివి శేష్ కూడా చేసాడు. ఇలా చేయడం మంచి అలవాటే అంటున్నారు సినీ పండితులు

Similar News