చిన్న సినిమాలకి గుడ్ న్యూస్

ఈ ఏడాది ఇంకా మన స్టార్స్ సినిమాలు ఏమన్నా రిలీజ్ అవ్వాలంటే “సైరా”, ప్రభాస్ “సాహో’ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. మిగిలిన స్టార్ హీరోల సినిమాలు [more]

Update: 2019-06-10 07:04 GMT

ఈ ఏడాది ఇంకా మన స్టార్స్ సినిమాలు ఏమన్నా రిలీజ్ అవ్వాలంటే “సైరా”, ప్రభాస్ “సాహో’ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. మిగిలిన స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యిపోయాయి. ప్రభాస్ నటిస్తున్న “సాహో’ చిత్రం ఆగస్టు 15 న స్వాతంత్ర్యదినాన్నిపురస్కరించుకొని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. రీసెంట్ గా ఈచిత్రం టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని సాంగ్స్ షూటింగ్ కి రెడీ అయింది.

అలానే మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టేజియస్ మూవీ సైరా కూడా అక్టోబర్ 2 న విడుదల కానుంది. ఈసినిమా యొక్క షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇలా 2019 లో స్టార్ హీరోల సినిమాలలో మిగిలింది ఈ రెండు మాత్రమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు చేస్తున్న #RRR చిత్రం 2020 జులై 30 న రిలీజ్ అధికారంగా ప్రకటించారు.

మహేష్ – అనిల్ రావిపూడి చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి లో రిలీజ్ అవుతుంది. అలానే బన్నీ – త్రివిక్రమ్ మూవీ కూడా 2020 సంక్రాంతి ని ఖాయం చేసుకున్నారు. దీనితో పాటు బాలయ్య – సి కళ్యాణ్ చిత్రం కూడా సంక్రాంతికి షెడ్యూల్ అయింది. సో ఈ ఏడాది స్టార్స్ సినిమాలు లేవు కాబట్టి చిన్న సినిమాలు, మీడియం సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. సో థియేటర్ల సమస్యతో బాధపడే చిన్న సినిమాలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Tags:    

Similar News