రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

తెలుగులో ఎలా ఉన్నది అనేది పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ అయిన పెట్ట తమిళంలో సూపర్ హిట్ అయ్యి టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి [more]

Update: 2019-02-21 07:59 GMT

తెలుగులో ఎలా ఉన్నది అనేది పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ అయిన పెట్ట తమిళంలో సూపర్ హిట్ అయ్యి టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచి రజనీ స్టామినాని మరోసారి రుజువు చేసింది. తెలుగులో ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇదిలా ఉంటే రజనీ నెక్స్ట్ మూవీ మురుగదాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే చిత్రం యూనిట్ నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందుతుంది. మురగదాస్ చిత్రంలో రజనీ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట. ఒక పాత్ర పోలీస్ ఆఫీసర్ గా, మరొక పాత్ర సోషల్ వర్కర్ గా కనిపించనున్నాడు.

మురుగదాస్ స్టైల్ స్టోరీతో…

రెండూ ఒకదానికి ఒకటి సంబంధం లేని రీతిలో సాగుతాయని సమాచారం. గతంలో రజనీ చేసిన డ్యూయల్ పాత్రల మాదిరిగా కాకుండా ఇందులో డ్యూయల్ రోల్స్ సమాంతరంగా సాగుతాయని టాక్. ఆయన నటించిన ముత్తు, అరుణాచలం, లింగాలో డ్యూయల్ పాత్రల్లో నటించినా అవి ఒకే ఫ్రేమ్ లో రెండు పాత్రలు కలుసుకునే సినిమాలు కావు. మురుగదాస్ తన స్టైల్ లో చెప్పే సోషల్ మెసేజ్ ని మిస్ చేయకుండా పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడట. ఇక రెండో సారి అనిరుధ్ రజనీ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Tags:    

Similar News