ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగేనా?

Update: 2018-10-15 06:30 GMT

ప్రభాస్ బాహుబలితో ప్రేక్షకుల దగ్గరికి వచ్చి చాలా రోజులు అవుతుంది. మధ్యలో అక్కడక్కడా కనబడడం తప్ప ప్రభాస్ కొత్త సినిమా నుండి లేటెస్ట్ లుక్ లాంటివేమీ బయటికి రాలేదు. స్టార్ హీరోల సినిమాలు అలా తెరకెక్కి ఇలా లుక్స్ తో సందడి చేస్తూ వారి అభిమానులు కోలాహలంగా వుంటుంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఉసూరుమంటున్నారు. తమ హీరో నుండి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పుడొస్తుందో అంటూ ఎదురు చూస్తున్నారు.

పుట్టినరోజున పండగే...

ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో, రాధాకృష్ణ దర్శకత్వంలో రెండు భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తున్నాడు. సాహో సినిమా మొదలు పెట్టి చాలా రోజులు గడుస్తున్నాయి. కానీ ఆ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఇక రాధాకృష్ణ సినిమాని రీసెంట్ గానే మొదలుపెట్టారు. ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్స్ ని బ్యాలెన్సుడ్ గా పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ పుట్టిన రోజు ఈ నెలలోనే ఉండడంతో ప్రభాస్ సినిమాల లుక్స్ బయటికొస్తాయనే ఆశతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న ప్రభాస్ ఫ్యాన్స్ కి శుభవార్తే అంటున్నారు.

రెండు సినిమాల లుక్స్...

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సాహో యొక్క టీజర్ ను అక్టోబర్ 22న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా జిల్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను కూడా అదే రోజు విడుదల చేయనున్నన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్ కి బ్రేకివ్వగా..రాధాకృష్ణ మూవీ మాత్రం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. మరి ప్రభాస్ రెండు ప్రాజెక్ట్ ల నుండి లుక్స్ బయటికొస్తున్నాయి అంటే... ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే అన్నమాట. అయితే సాహో టీజర్, రాధాకృష్ణ సినిమా లుక్ మీద ఇంకా సరైన క్లారిటీ అయితే లేదు.

Similar News