పవన్ ఫాన్స్ కి పండగే!!

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతికి సినిమాలకు దూరమై రెండేళ్లు. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ తర్వాత సినిమాలను వదిలేసి, అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. [more]

Update: 2020-07-15 06:36 GMT

పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతికి సినిమాలకు దూరమై రెండేళ్లు. అజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ తర్వాత సినిమాలను వదిలేసి, అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. అయితే రాజకీయాల్లోనూ జీరో గా మిగిలాక మళ్ళి సినిమాలంటూ రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ ఫాన్స్ పవన్ ని రాజకీయనాయకుడిగా చూడలేకపోయారు. ఫలితమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సున్నాగా మిగలడం. అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తున్నాడని తెలియగానే పవన్ ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. వకీల్ సాబ్ తో నాలుగు నెలలోనే పవన్.. ఫాన్స్ కి ట్రీట్ ఇస్తాడనుకుంటే కరోనా అడ్డం పడి పవన్ ఆశల మీద ఫాన్స్ ఆనందం మీద నీళ్లు చల్లింది.

అయితే పవన్ ఫాన్స్ వకీల్ సాబ్ లుక్ తోనే నెలలుగా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ ఫాన్స్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినెమా కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తుంటే కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డం పడుతూనే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఇప్పుడు పండగ లాంటి వార్త. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా టీజర్ ని విడుదల చేసేందుకు వకీల్ సాబ్ టీం ప్లాన్ చేస్తుందట. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదల చెయ్యాలని ఏర్పాట్లు చేస్తున్నారట. కరోనా ముగిస్తే ఉన్న 20 రోజుల షూటింగ్ పూర్తి చేసేస్తారు. కానీ కరోనా ఇలా ఉంటే.. పవన్ టీజర్ తో ఫాన్స్ ని శాటిస్ఫాయ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే పవన్ బర్త్ డే హాష్ టాగ్ సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ లో ఉంది.

Tags:    

Similar News