అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’, మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19వ [more]

Update: 2018-12-31 08:38 GMT

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’, మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది. హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలో, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు చాలా ఉన్నాయి.

జనవరిలోనే ప్రారంభం

వీటిని నిజం చేసే దిశగా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతా ఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. 2019 జనవరిలో చిత్రం ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.

Tags:    

Similar News