'గీత గోవిందం'కి లీకులు బెడదా

Update: 2018-08-12 16:35 GMT

తెలుగు ఇండస్ట్రీ లీకులు నుండి బయట పడలేకపోతుంది. ఎన్ని జాగ్రత్తలు.. ఎన్ని రూల్స్ పాటించిన ఆ లీకులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. రీసెంట్ గా 'అరవింద సమేత' లో కొన్ని సీన్స్ తో పాటు కొన్ని స్టిల్స్ కూడా లీక్ అయ్యాయి. ఈనెల 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న 'గీత గోవిందం' సినిమా కూడా లీకులు భారిన పడింది.

కొంతమంది గుంటూరు విద్యార్థులు ఈ సినిమాలో కొంత భాగాన్ని పైరసీ చేసినట్టుగా తెలుస్తోంది. వారిని గుంటూరు పోలీస్ వారు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆ లీక్ అయ్యిన సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఆ సీన్స్ పబ్లిష్ చేయగా అవి డిలీట్ చేసేశారు అధికారులు. గుంటూరులోని రెండు ప్రైవేట్ కాలేజీల విద్యార్ధులు ఈ పని చేసినట్టు గుర్తించారు. 'గీత గోవిందం' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు అక్కడ టెక్నికల్ టీంకు చెందిన ఓ వ్యక్తి కొంత భాగాన్ని ఫోన్ ద్వారా తన మిత్రులకు పంపడంతో ఆలా అది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యింది.

ఆ టెక్నికల్ టీంకు చెందిన వ్యక్తి ని.. ఆ వీడియోను సర్క్యూలేట్‌ చేసిన విద్యార్థులని అందర్నీ పోలీస్ వారు రిమాండ్ లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇందులో ఎవరుఎవరు ఉన్నారో అన్న దానిపై విచారణ చేస్తున్నారట. సోషల్ మీడియాలో సర్క్యూలేట్‌ ఆ వీడియోను డిలీట్ చేసేందుకు చిత్ర నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు. 'అరవింద సమేత' విషయంలో కూడా మేకర్స్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది

Similar News