ఆ డైరెక్టర్ ఆసుపత్రి పాలయ్యాడు

తెలుగు హీరోయిన్ అంజలి మెయిన్ లీడ్ లో ఐదేళ్లు కిందట వచ్చిన గీతాంజలి సినిమా తో డైరెక్టర్ గా మరిచయం అయినా రాజ్ కిరణ్ తన తొలి [more]

Update: 2019-06-13 07:32 GMT

తెలుగు హీరోయిన్ అంజలి మెయిన్ లీడ్ లో ఐదేళ్లు కిందట వచ్చిన గీతాంజలి సినిమా తో డైరెక్టర్ గా మరిచయం అయినా రాజ్ కిరణ్ తన తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. కామెడీ ని బాగా డీల్ చేసాడు అని పేరు తెచ్చుకున్న రాజ్ కు ఆ తరువాత అంతగా కలిసి రాలేదు. ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ లాంటి డిజాస్టర్లు వచ్చాయి రాజ్ నుంచి.

ఆ తరువాత సినిమాలు ఏమి చేయకుండా కొంచం గ్యాప్ తీసుకుని నందిత కథానాయికగా ‘విశ్వామిత్ర’ అనే సినిమా తీశాడు. ఈమూవీ ఈనెల 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాకి రాజ్ కిరణ్ నిర్మాణ భాగస్వామి కూడా. అయితే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్న టైములో రాజ్ కిరణ్ చిన్నపాటి గుండె నెప్పితో ఆసుపత్రి పాలయ్యాడు.

ఈ డైరెక్టర్ కి ఇలా రావడం ఇదే మొదటిసారి కాదు. ఆల్రెడీ తన మొదటి సినిమా గీతాంజలి రిలీజ్ కి ముందు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీరిక లేకుండా ఉన్న అతను తీవ్ర ఒత్తడికి గురయ్యాడు. ఇప్పుడు రెండోసారి కావడంతో కొంత ఆందోళన చెందారు కుటుంబసభ్యులు. వరసగా రెండు డిజాస్టర్స్ రావడంతో తాను తీసిన ‘విశ్వామిత్ర’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రాజ్. మరి ఈసినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి

Tags:    

Similar News