ఓవర్సీస్ లో గీత గోవిందం హవా ఎలా ఉందంటే...!!

Update: 2018-09-16 07:30 GMT

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా.. పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన గీత గోవిందం మూవీ ఇప్పటికి 25 రోజులు పూర్తి చేసుకుని... 50 రోజుల కోసం పరుగెడుతోంది. నిన్న గురువారం విడుదలైన శైలజ రెడ్డి అల్లుడు, యూ టర్న్ మూవీస్ కు కాస్త బలమైన టాక్ థియేటర్స్ రావడంతో.. గీత గోవిందం హవా కాస్త తగ్గింది కానీ.. ఈ 25 రోజుల్లో గీత గోవిందం కలెక్షన్స్ అదరహో అనేలా ఉన్నాయి. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులను తిరగరాసింది. ఇప్పటికే నైజాం హీరోగా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓవర్సీస్ లోను సత్తా చాటాడు. నితిన్ తో నైజాం లో పెట్టుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓవర్సీస్ లోను నితిన్ అ.. ఆ కలెక్షన్స్ ని దాటేయడమే కాదు.. నైజాం లో చిరు ఖైదీ నెంబర్ 150 కి చుక్కలు చూపెట్టిన గీత గోవిందం ఇక్కడ ఓవర్సీస్ లోను ఖైదీ కలెక్షన్స్ ని దాటేసింది. అ... ఆ., ఖైదీ నెంబర్ 150, ఫిదా సినిమాల కన్నా హైయ్యెస్ట్ కలెక్షన్స్ తో గీత గోవిందం ఓవర్సీస్ లో టాప్ 7 కి వెళ్ళిపోయింది. ఇక మహానటి కలెక్షన్స్ కు దరిదాపుల్లోకి వచ్చేసిన గీత గోవిందం మహానటిని కూడా ఓవర్సీస్ లో దాటేసేలా కనబడుతుంది. చూద్దాం గీత ఇంకెంతమందిని టార్గెట్ చేస్తుందో అనేది.

1. బాహుబలి 2 - $21 Mn

2. బాహుబలి - $8.46 Mn

3. రంగస్థలం - $3.513

4. భారత్ అనే నేను - $3.416

5. శ్రీమంతుడు - $2.891

6. మహానటి - $2.544

7. గీత గోవిందం - $2,454,233

8. అ ఆ - $2,453,227

9. ఖైదీ నెంబర్ 150 - $2.447

10. ఫిదా - $2.067

Similar News