గీత గోవిందంకు యు/ఎ ఎందుకు వచ్చింది?

Update: 2018-08-05 09:15 GMT

ఈ నెల 15 న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతున్న విజయ్ దేవరకొండ మూవీ గీత గోవిందం సినిమాపై ప్రేక్షకుల్లో చాలానే అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా సాంగ్స్ కూడా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడాయి. రెండు రోజులు కిందట ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యు/ఎ తో బయటకి వచ్చింది.

వాస్తవానికి ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఫామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్నా ఈ చిత్రంలో ఎ కంటెంట్ ఏముందా అనే అనుమానం రాకమానదు. అంతే కాకుండా ఈ సినిమాలో కొన్ని సీన్స్ పై సెన్సార్ అభ్యంతరం తెలపడంతో వాటిని తీసేశారని తెలిసింది. పరుశురాం ఫామిలీ కంటెంట్ సినిమాలను డీల్ చేయడంలో ఎక్స్పర్ట్. మరి ఆలాంటి దర్శకుడు ఈ సినిమాలో ఎ కంటెంట్ ఉండే అంశాలు ఏం పెట్టాడో అన్న అనుమానం రావడం సహజం.

విజయ్ - రష్మిక మధ్య రొమాంటిక్ సీన్స్ తో పాటు బయట జనాలు అబ్జెక్షన్ చేసే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి అంట. అవి తీసేసినట్టు టాక్. అయితే ఈ సినిమా మేకర్స్ కి ఓ ఐడియా వచ్చిందంట. సినిమా రిలీజ్ కు ఒక వారం ముందు ఆ తీసేసిన సీన్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందంట. అయితే ఆలా రిలీజ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ కంటే నెగటివ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉండటంతో కొంత మంది తమ ఒపీనియన్ చెప్పారంట. సో అవి సినిమా రిలీజ్ అయ్యాకే యూట్యూబ్ లో పబ్లిష్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట మేకర్స్

Similar News