గీత గోవిందం శాటిలైట్ రైట్స్ మరీ అంత తక్కువా..?

Update: 2018-08-28 06:34 GMT

'గీత గోవిందం' సినిమా థియేటర్స్ లో దుమ్ము దులుపుతుంటే.. టీవీలలో కూడా అదే జోరు కొనసాగించడానికి రెడీ అయిపోయింది. బ్లాక్ బస్టర్ పేరుతో కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కు గట్టి పోటీయే వచ్చింది. ఈ పోటీలో జీ తెలుగు ఛానల్ వారు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారు. అయితే ఈ సినిమాను జీ తెలుగు అతి తక్కువ మొత్తానికి దక్కించుకుందట. కేవలం కోటిన్నరకే ఈ సినిమాను నిర్మాతలు అమ్మినట్టు సమాచారం. కాకపోతే ఈ డీల్ సినిమాకి ముందు జరగడంతో అంత తక్కువ రేట్ కి అమ్ముడుపోయింది. మహానటి లాగా రిలీజ్ తర్వాత శాటిలైట్ అమ్ముకుంటే బాగుండేదని బాధపడుతున్నారంట నిర్మాతలు.

టాక్సీవాలా కూడా కలిపి అమ్మెసి...

ఇటు నిర్మాతలు బాధపడుతుంటే జీ తెలుగు వారు బ్లాక్ బస్టర్ లాంటి సినిమా అంత తక్కువకి దక్కించుకోడంతో చాలా అనందంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. అల్లు అరవింద్ చాలా తెలివిగా ఈ సినిమాతో పాటు అసలు బజ్ లేని టాక్సీవాలా సినిమాను కూడా అమ్మేశాడట.

Similar News