స్టిల్ వర్జిన్ అంటున్న విజయ్ దేవరకొండ

Update: 2018-07-03 06:09 GMT

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవ‌ర‌కొండ త‌న కెరీర్ స్టార్టింగ్ నుండి త‌న చిత్రాల్ని ప్ర‌మెట్ చేసుకునే విధానం కొత్త‌గా వుండ‌ట‌మే కాకుండా ఆడియ‌న్స్ కి స్ట్రైట్ గా రీచ్ అయ్యేలా త‌న స్టెట్‌మెంట్ వుంటుంది. ఎక్క‌డా మిడిల్ డ్రాప్ లు వుండ‌వనేది అర్జున్ రెడ్డిని ప్ర‌మెట్ చేసిన విధానంలోనే అంద‌రికీ తెలిసింది. ఇప్ప‌డు త‌ను న‌టించిన "గీత గోవిందం" చిత్రం కూడా అదే త‌ర‌హ‌లో ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యేలా ‘ఆయామ్ 25 స్టిల్ వ‌ర్జిన్’ అనే క్యాప్ష‌న్ పోస్ట‌ర్ తో త‌న పాత్ర‌ తీరును తెలియ‌జేసేలా విడుద‌ల చేశారు. ఈ చిత్రం లో చ‌లో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం" గీత గోవిందం". ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. "గీత గోవిందం" మెద‌టి లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

 

Similar News