గీత గోవిందం క్లోజింగ్ కలెక్షన్స్..!

Update: 2018-10-08 06:44 GMT

విజయ్ దేవరకొండ గీత గోవిందం విడుదలై 50 రోజులపైనే అయ్యింది. ఈ 50 రోజుల్లోనే గీత గోవిందం విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో విజయ్ 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన గీత గోవిందం సినిమా ఇంతగా హిట్ అవుతుందని అంచనా వేయలేకపోయారు. పరశురామ్ దర్శకత్వంలో కామెడీ ఎంటెర్టైనెర్ గా అదిరిపోయే హిట్ అయిన గీత గోవిందంకి, జరిగిన బిజినెస్ కి కొల్లగొట్టిన కలెక్షన్స్ కి అస్సలు పొంతనే లేదు. ఇక గీత గోవిందం క్లోజింగ్ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 68 కోట్లు కొల్లగొట్టింది

ఏరియా క్లోజింగ్ షేర్స్(కోట్లలో)

నైజాం 19.60

సీడెడ్ 6.90

అర్బన్ ఏరియా 6.00

ఈస్ట్ గోదావరి 3.80

కృష్ణ 3.67

గుంటూరు 3.80

వెస్ట్ గోదావరి 3.16

నెల్లూరు 1.72

ఏపీ అండ్ టీఎస్ షేర్స్ 48.65

ఇతర ప్రాంతాలు 8.30

ఓవర్సీస్ 11.25

వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ 68.20

Similar News