మరో 15 రోజులు గోవింద్ కి ఎదురు లేనట్లే..!

Update: 2018-08-16 06:59 GMT

వీక్ మిడిల్ బుధవారం రోజున ఆగస్టు 15న తన సినిమా గీత గోవిందం మీదున్న నమ్మకంతో.. విజయ్ దేవరకొండ ఈ సినిమాని విడుదల చేసాడు. మరి విజయ్ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. సినిమా మొదటి షోకే హిట్ టాక్ వచ్చేసింది. గీత గోవిందం సినిమా ఓవరాల్ గా సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. వీక్ మిడిల్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండకి రేపు శుక్రవారం పోటీనే లేదు. గత శుక్రవారం విడుదలైన శ్రీనివాస కళ్యాణం, విశ్వరూపం సినిమాలు దుకాణం సర్దేయడం.. గీత గోవిందానికి బాగా కలిసొచ్చింది. ఇక సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న గీత గోవిందానికి వచ్చే శుక్రవారం ఏ సినిమా పోటీకి లేకపోవడం.. వచ్చే శుక్రవారం వరకు అంటే మరో పదిరోజుల పాటు కలెక్షన్స్ కుమ్మెయ్యడం.. ఈ సినిమాని నిర్మించిన బన్నీ వ్యాస్ కి బాగా కలిసొస్తుంది.

మరో 15 రోజులు ఢోకా లేదు...

గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫామిలీ ఆడియన్స్ తో పాటుగా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక సినిమా రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కడం.. విజయ్ దేవరకొండ కామెడీతో కూడిన డైలాగ్స్ తో సినిమాలో పిచ్చెక్కించడం, హీరోయిన్ రష్మిక నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్. అలాగే విజయ దేవరకొండ - రష్మిక ల మధ్యన రొమాంటిక్ సన్నివేశాలు, విజయ్ స్టైలిష్ లుక్స్, రష్మిక కూల్ లుక్స్ అన్ని సినిమాలో ప్రధాన ఆకర్షణగా వున్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కాస్త స్లో అవడం, ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు తప్ప సినిమాలో మైనస్ పాయింట్స్ పెద్దగా కనబడడం లేదు. ఇక ఈ వీకెండ్ మాత్రమే కాదు... వచ్చే సోమవారం నుండి శుక్రవారం వరకు గీత గోవిందం థియేటర్స్ ఫుల్ అవడం ఖాయంగా కనబడుతున్నాయి. అలాగే గీత గోవిందం ఓవర్సీస్ లోనూ కుమ్మేస్తుంది. ఇక ఆగస్టు 24న రాబోయే సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించే సినిమాలేమి కనబడం లేదు. అంటే అదనంగా మరో వారం రోజులు గీత గోవిందానికి కలిసొచ్చే అంశంలా కనబడుతుంది.

క్రేజ్ ఉన్న సినిమాలు లేకపోవడంతో...

ఆగస్టు 24న రాబోయే సినిమాల్లో ఆటగాళ్లు, నీవెవరో, ఈ మాయ పేరేమిటో, అంతకు మించి సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. అందులో నారా రోహిత్, జగపతి బాబుల ఆటగాళ్లు సినిమాకి కాస్త క్రేజ్ ఉంది. అలాగే ఆది పినిశెట్టి, తాప్సి, రితిక సింగ్ లు నటించిన నీవెవరో సినిమా కూడా కాస్త అంచనాలున్నాయి. ఇక రష్మీ గౌతమ్ అంతకు మించి, ఈమాయ పేరేమిటో సినిమాల మీది అంతగా క్రేజ్ అయితే లేదు. మరి ఆటగాళ్లు, నీవెవరో సినిమాలకు కాస్త టాక్ తేడా వచ్చిందా గీత గోవిందం సినిమా మళ్లీ మరో వారం కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం. అలా మరో 15 రోజుల పాటు గీత గోవిందానికి బాగా కలిసొచ్చే లాగా కనబడుతుంది.

 

Similar News