U/A స‌ర్టిఫికెట్ తో అగ‌స్టు 15న "గీతగోవిందం" విడుద‌ల‌

Update: 2018-08-04 11:50 GMT

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం

" గీత గోవిందం". ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మించారు. గోపి సుంద‌ర్ అందించిన ఆడియో ఇటీవ‌లే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుద‌ల చేసారు. ఇప్ప‌టికే సింగిల్ గా విడుద‌లయ్యిన ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ దాదాపు 35 మిలియ‌న్స్ వ్యూస్ తో 4 ల‌క్ష‌ల అర‌వై వేల‌కి పైగా లైక్స్ ని సాధించి సౌత్ ఇండియాలో ఏ చిత్రానికి రాని విధంగా ట్రెండింగ్ లొ వుండ‌టం ఈ చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ ని డ‌బుల్ చేసింది. ఆడియో కి 14 ల‌క్ష‌ల వ్యూస్‌ చేరుకొవ‌టం విశేషం. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యియి. U/A స‌ర్టిఫికెట్ తో అగ‌స్టు 15న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

 

Similar News