వ్యభిచారి పాత్రలో స్టార్ హీరోయిన్

బాలీవుడ్ బుల్లి బ్యూటీ అలియా భట్ చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో లీడ్ పాత్ర చేస్తుంది. చరిత్రకు సంబంధించి సినిమాలు తీసే భన్సాలీ [more]

Update: 2019-10-18 06:46 GMT

బాలీవుడ్ బుల్లి బ్యూటీ అలియా భట్ చారిత్రక చిత్రాలను తెరక్కెక్కించే సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో లీడ్ పాత్ర చేస్తుంది. చరిత్రకు సంబంధించి సినిమాలు తీసే భన్సాలీ ఇప్పుడు కూడా ఓ రియల్ లైఫ్ స్టోరీ తీయబోతున్నాడు. ఈసారి వ్యభిచారి గురించి సినిమా తీయబోతున్నాడు. భన్సాలీ సినిమాలు అంటే ఒక్కో చిత్రం ఒక్కో దృశ్యకావ్యంగా నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు ఆయన కొంచం డిఫరెంట్ గా వెళ్తున్నారు.

చివరి నిమిషంలో…

‘గంగూ భాయ్ కతియావాడి’ అనే టైటిల్ తో తెరక్కెక్కుతున్న ఈ మూవీ ముంబయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురాకు సంబంధించిన కథ. ఆ ప్రాంతంలో గంగూబాయి అనే ఆవిడ తన చిన్న తనంలోనే వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. దాంతో ఆమె అక్కడే వ్యభిచార గృహాలను నడుపుతూ రౌడీరాణిగా ఎదిగింది. ఈమూవీలో ఇవి చూపించనున్నారు. నిజానికి ఈ మూవీలో అలియా ప్లేస్ లో ప్రియాంక చోప్రా చేయాల్సివుంది కానీ చివరి నిమిషంలో అలియా చేస్తుంది. ఇక ఈమూవీ 2020 సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

 

 

Tags:    

Similar News