అందుకే ఐటెం సాంగ్స్ చేస్తున్న తమన్నా

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ , సౌత్ అని తేడా లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ [more]

Update: 2019-01-10 04:41 GMT

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా చాలా తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నార్త్ , సౌత్ అని తేడా లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్ళిపోతుంది. చిన్న హీరోస్ నుండి స్టార్ హీరోస్ దాక అమ్మడికి భారీ ఆఫర్సే వస్తున్నాయి. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటెమ్ సాంగ్స్ తో ఫిదా చేస్తుంది.

తెలుగు లో అల్లుడు శీను – జాగ్వార్ – జై లవకుశ రీసెంట్ గా వచ్చిన కెజీయాఫ్ లో తన స్టెప్స్ తో కుర్రకారుల మనసులు దోచుకుంది ఈ అమ్మడు. గ్లామర్ తో కూడిన ఐటమ్స్ సాంగ్స్ చేయడానికి కారణం ఇటీవల జరిగిన F2 ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

నా కెరీర్ స్టార్టింగ్ లో నేను నా డాన్స్ కు ప్రాముఖ్యత ఇచ్చాను. కానీ మెల్లమెల్లగా డ్యాన్స్ టాలెంట్ ను ప్రదర్శించడానికి అవకాశం తగ్గడంతో నా టాలెంట్ ను దాచుకోవాల్సి వచ్చింది. అందుకే అప్పుడప్పుడు నా టాలెంట్ నిరూపించుకోవడానికి స్పెషల్ గా ఐటెమ్ సాంగ్స్ లు చేస్తుంటాను. సినిమాల్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ పైనే దృష్టి ఉంటుంది. అదే నాకు మంచి అవకాశం అని భావిస్తాను అని తమన్నా చెప్పింది.

Tags:    

Similar News