రాజ‌శేఖ‌ర్ సినిమాకు భ‌లే క‌లిసొస్తుందే

చాన్నాళ్లుగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయిన రాజశేఖర్ కి పిఎస్వీ గరుడావెగా సూపర్ హిట్ అయ్యి రాజశేఖర్ ని మళ్లీ నిలబెట్టింది. ఆ సినిమా విజయంతో [more]

Update: 2019-05-13 08:34 GMT

చాన్నాళ్లుగా హిట్ అనే పదానికి మొహం వాచిపోయిన రాజశేఖర్ కి పిఎస్వీ గరుడావెగా సూపర్ హిట్ అయ్యి రాజశేఖర్ ని మళ్లీ నిలబెట్టింది. ఆ సినిమా విజయంతో మళ్లీ ఎంతో ఉత్సాహంతో కల్కి సినిమా చేసాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెరిగేలా చేశాయి. ఇప్పటికే కల్కి బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది. 70వ దశకంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో రాజశేఖర్ పోలీస్ క్యారెక్టర్ చేశాడు. ఇక సినిమా విడుదలకు రాజశేఖర్ మంచి టైం ఎంచుకున్నాడు. వేసవి సెలవులు ఇంకా పది రోజులు ఉండగానే తన సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేసాడు.

మంచి వ‌సూళ్లు ఖాయం

కల్కి ట్రైలర్ లో తనని తానే ఇమిటేట్ చేసుకున్న రాజశేఖర్ సినిమా మీద మంచి హైప్ పెంచాడు. ఇక వేసవి సెలవుల్లో విడుదలైన సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా కలెక్షన్స్ బాగుంటాయి. అందుకే కల్కిని మే 31న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాములుగా అయితే మే 31న విజయ్ దేవరకొండ తన డియర్ కామ్రేడ్ విడుదల చేస్తున్నట్లుగా మొదట్లో అనౌన్స్ చేసినా… తరవాత జులై 30కి తన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ శుక్రవారం అల్లు శిరీష్ ఏబీసీడీ, మే 24 న బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ సీత సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ సినిమాలకు ఎంతగా హిట్ టాక్ వచ్చినా కల్కికి ఈ వేసవిసెలవులు కసిసొస్తాయి. అందులోనూ సినిమాకి పాజిటివ్ బజ్ కూడా ఉంది. ఆ క్రేజ్ తోనే మంచి కల్లెక్షన్స్ కల్కి కి రావడం పక్కా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి కేవలం 10 కోట్ల బడ్జెట్ లో సినిమాని పూర్తి చేసిన నిర్మాతలకు కల్కితో మంచి లాభాలు రావడం ఖాయమంటున్నారు.
క‌ల్కి, రాజ‌శేఖ‌ర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డియ‌ర్ కామ్రేడ్

Tags:    

Similar News