ఖైదీ – విజిల్ మధ్య ఇరుక్కున్న వెంకీ?!

వెంకిమామ. దసరా నుంచి దీపావళికి షిఫ్ట్ అయింది. కోలీవుడ్ లో దీపావళి కి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈనేపధ్యంలో ఈ దీపావళి ఎప్పటిలానే విజయ్ సినిమా [more]

Update: 2019-09-12 10:41 GMT

వెంకిమామ. దసరా నుంచి దీపావళికి షిఫ్ట్ అయింది. కోలీవుడ్ లో దీపావళి కి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈనేపధ్యంలో ఈ దీపావళి ఎప్పటిలానే విజయ్ సినిమా ‘బిగిల్’ వస్తుంది. విజయ్ ప్రతి దీపావళి కి తన సినిమా రిలీజ్ చేస్తుంటాడు. అలానే ఈ దీపావళికి కూడా అట్లీ డైరెక్ట్ చేసిన బిగిల్ రిలీజ్ అవుతుంది.

విజిల్ పేరుతో బిగిల్…..

అలానే కార్తీ నటించిన ‘ఖైదీ’ కూడా ఆ పండక్కే వస్తోంది. ఈ రెండు సినిమాలు తమిళంతో పాటు తెలుగు లో కూడా ఒకేసారి రిలీజ్ అవ్వనున్నాయి. విజయ్ నటించిన ‘బిగిల్’ తెలుగు లో ‘విజిల్’ పేరుతో పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు రిలీజ్ చేయనున్నాడట. అలానే కార్తీ నటించిన ‘ఖైదీ’ ‘నగరం’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రిలీజ్ కానుంది. మరి ఈ రెండు మూవీస్ తో ‘వెంకీ మామ’కు పోటీ తప్పదా? అసలే ఇద్దరి హీరోస్ కి తెలుగు లో మంచి మార్కెట్ ఉంది.

 

Tags:    

Similar News