నా వాళ్ళే నన్ను మోసం చేశారంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ సీజన్ 4 లో ఎవరికీ పెద్దగా పరిచయం లేని కండల వీరుడు మెహబూబ్. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అంటున్నారు. ఓ [more]

Update: 2020-11-29 13:44 GMT

బిగ్ బాస్ సీజన్ 4 లో ఎవరికీ పెద్దగా పరిచయం లేని కండల వీరుడు మెహబూబ్. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అంటున్నారు. ఓ మూడు నాలుగు వారాలకే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవుతాడనుకుంటే.. పది వారాలు హౌస్ లో ఉండి సత్తా చాటాడు. కొన్ని వారాలు బిగ్ బాస్ మెహబూబ్ ని సేవ్ చేసాడనే ట్రోల్స్ వచ్చినా మెహబూబ్ తన కండ బలంతో బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు గెలిచి నిలబడ్డాడు. అయితే రెండు వారాల ముందు ఎమోషనల్ గా బయటికి వెళ్లిన మెహబూబ్ తాజాగా తాను హౌస్ నుండి బయటికి వచ్చాక రెండు రోజులు ఏమి తినలేదు అని అన్నాడు. కారణం ఒకటి ఎలిమినేట్ కావడం అయితే రెండోది.. తాను నా వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేసారని చెబుతున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో తనకి ఆపర్చునిటీ రావడం మాములు విషయం కాదని, తాను హౌస్ లోకి వెళ్లే రెండు రోజుల ముందు తన ఫ్రెండ్స్ లో చాలామందికి ఫోన్ చేసి తనకి ఈ అవకాశం వచ్చింది అని అందరిని సపోర్ట్ చెయ్యమని అడిగానని చెప్పాడు. కానీ హౌస్ నుండి బయటికొచ్చి చూస్తే ఒక్కళ్ళు తనని సపోర్ట్ చెయ్యలేదని.. కనీసం సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పెట్టలేదని.. ఇంకా పైగా ఓ మూడు వారాల్లోనే బయటికొచ్చేస్తావ్ అనుకుంటే పది వారాలున్నావ్ అంటూ వెటకారం చేసారంటూ బాధపడుతున్నాడు మెహబూబ్. బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు.,.. మెంటల్ గా డిస్టర్బ్ అవుతాం, పేరేంట్స్ ఉండరు, మైండ్ గేమ్ ఆడాలి.. కానీ బయట నా అనుకున్న వాళ్ళే నన్ను ఇంత ఘోరంగా మోసం చేసారంటూ ఎమోషనల్ అయ్యాడు మెహబూబ్.

Tags:    

Similar News