మాస్ మీద క్లాస్ గెలిచింది..!

నిన్న ఒక క్లాస్ సినిమా, మరో మాస్ సినిమా బాక్సాఫీసు వద్ద పోటీపడ్డాయి. ఒకటి తెలుగు స్ట్రయిట్ మూవీ, మరొకటి డబ్బింగ్ సినిమా. ఇక క్లాస్ సినిమాగా [more]

Update: 2019-04-20 07:30 GMT

నిన్న ఒక క్లాస్ సినిమా, మరో మాస్ సినిమా బాక్సాఫీసు వద్ద పోటీపడ్డాయి. ఒకటి తెలుగు స్ట్రయిట్ మూవీ, మరొకటి డబ్బింగ్ సినిమా. ఇక క్లాస్ సినిమాగా నాని జెర్సీ సినిమా ఉంటే.. మాస్ సినిమాగా రాఘవ లారెన్స్ కాంచన 3 సినిమా ఉంది. నాని – శ్రద్ద శ్రీనాధ్ జంటగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో సితార ఎంటెర్టైమెంట్ నిర్మాణంలో తెరకెక్కిన జెర్సీ నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో హడావిడి చేస్తుంది. గౌతమ్ దర్శకత్వానికి, కథ, కథనానికి, నాని, శ్రద్ద శ్రీనాధ్ నటనకు, అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి, సినిమాటోగ్రఫీ, సంభాషణలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాస్త నిడివి ఇబ్బంది పెట్టినా అక్కడక్కడా లాగింగ్ సీన్స్ ఉన్నప్పటికీ.. అన్ని పాజిటివ్ పాయింట్స్ మధ్య ఆ లోపాలు పెద్దగా కనిపించలేదు. అలా జెర్సీ క్లాస్ ఆడియన్స్ ని మెప్పించింది.

రొటీన్ గా కాంచ‌న 3

మరి మాస్ ఆడియన్స్ ని టార్టెట్ చేస్తూ రాఘవ లారెన్స్ హీరోగా నటించి డైరెక్షన్ చేసిన కాంచన 3 సినిమా కూడా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కిన కాంచన 3 సినిమాని తెలుగులోనూ డబ్ చేసి తమిళంతో పాటుగా విడుదల చేసాడు లారెన్స్. తెలుగులోనూ లారెన్స్ కి మంచి మర్కెట్ ఉండడంతో కాంచన 3 కి ఇక్కడ భారీ బిజినెస్ కూడా జరిగింది. కానీ కాంచన 3 మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. రాఘవ నటన బాగున్నప్పటికీ… కాంచన 3 రొటీన్ మూవీగా మిగిలిపోయింది. ప్రేక్షకులను దెయ్యంతో భయపెడదామని రాఘవ అనుకుంటే.. ప్రేక్షకులు కాంచన 3 చూసి ఆ రొటీన్ సినిమా చూడలేక భయపడి పారిపోతున్నారు. రివ్యూ రైటర్స్ కూడా కాంచన 3ని ఉతికి ఆరేశారు. కాంచన, గంగ రేంజ్ లో కాంచన 3 లేకపోవడమే కాదు కాంచన 3 రొటీన్ మాస్ మసాలాలా ఉండడంతో ఆ సినిమాకి నెగెటివ్ టాక్ పడింది. మరి ఆ విధంగా మాస్ మూవీ కాంచన 3 మీద క్లాస్ మూవీ జెర్సీ గెలిచినట్లేగా..!

Tags:    

Similar News