ఈ శుక్రవారం హీరో ఎవరో..!

Update: 2018-12-05 07:17 GMT

ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాలన్నీ మీడియం బడ్జెట్ సినిమాలు కావడం... ఆ సినిమాల్లో నటించిన హీరోల్లో యావరేజ్ తో సరిపెట్టుకున్న హీరో ఒకరైతే... ఫ్లాప్ హీరోలు ఇద్దరు. ఇక మరో రెండు సినిమాల్లో కొత్త నటులు ఉన్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో రజినీకాంత్ లేటెస్ట్ సినిమా 2.ఓ కొట్టుమిట్టాడుతోంది. 2.ఓ భారీ హిట్ అవుతుందేమో అని టెన్షన్ పడ్డ కవచం, సుబ్రమణ్యపురం, నెక్స్ట్ ఏంటి నిర్మాతలు 2.ఓకి సో సో టాక్ వచ్చేసరికి మళ్లీ హడావిడి మొదలుపెట్టి డిసెంబర్ 7న బరిలో దిగడానికి సిద్ధమయ్యారు. నాలుగు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించినా పెద్దగా క్రేజ్ తెచ్చుకొని బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ టాప్ హీరోయిన్స్ కాజల్, మెహ్రీన్ కౌర్ తో కవచం అంటూ బరిలోకి దిగుతున్నాడు.

బరిలో మూడు సినిమాలు...

కవచం సినిమా ప్రమోషన్స్ తో, హీరోయిన్స్ క్రేజ్ తో కాస్త అంచనాలున్న ఫిలింగా కనబడుతుంది. ఇక మరో హీరో సుమంత్ మళ్లీరావా సినిమాతో కాస్త ఫామ్ లో కొచ్చాడు. సుమంత్ - ఈషా రెబ్బ కలిసి నటించిన సుబ్రమణ్యపురం కూడా కాస్త ఆసక్తి ఆకలిగించే సినిమాగానే కనబడుతున్నప్పటికీ... ఆ సినిమాకి నిఖిల్ - స్వాతి జంటగా గతంలో వచ్చిన కార్తికేయ మూవీతో ముడిపెడుతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కాస్త వీక్ గానే ఉంది. మరో సినిమా హీరోయిన్ తమన్నా క్రేజ్ తో కనబడుతుంది. సందీప్ కిషన్ - తమన్నా జంటగా వస్తున్న నెక్స్ట్ ఏంటి కూడా ప్రమోషన్స్ లో పర్వాలేదనిపించినప్పటికీ... సందీప్ కిషన్ గత చిత్రాల డిజాస్టర్స్ ఈ సినిమా మీద హైప్ తగ్గేలా చేస్తుంది.

కొత్త నటులతో రెండు సినిమాలు...

మరి మరో రెండు చిన్న సినిమాలు కూడా ఈ శుక్రవారం సై అంటున్నాయి. అవి కొత్త నటులతో తెరకెక్కిన శుభలేఖలు, హుషారు సినిమాలు. ఇకపోతే అన్ని సినిమాల్లోకెల్లా కాస్త బెల్లంకొండ నటించిన కవచం మాత్రమే ఇంట్రెస్టింగ్ గా కనబడుతున్న సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో కాజల్ గ్లామర్, మెహ్రీన్ లుక్స్ అన్ని ఆకట్టుకునేలా కనబడుతున్నాయి. చూద్దాం ఈ శుక్రవారం ఏ హీరో గట్టెక్కుతాడో అనేది.

Similar News