సాహో నుంచి ఫ్రెష్ అప్ డేట్..!

ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చిన కష్టాలు ఏ ఫ్యాన్స్ కి రాకూడదు. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ప్రభాస్ సినిమా కోసం వారు ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ [more]

Update: 2019-05-04 08:26 GMT

ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చిన కష్టాలు ఏ ఫ్యాన్స్ కి రాకూడదు. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ప్రభాస్ సినిమా కోసం వారు ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్ లో రెండేళ్లుగా ‘సాహో’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే ‘సాహో’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ గా ముంబైలో ‘సాహో’ చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రభాస్, శ్రద్ధా కపూర్ మీద డ్యూయెట్ కోసం యురప్ వెళ్లనుంది చిత్ర బృందం. అక్కడే ప్రభాస్ నెక్స్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు అక్కడే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఇక ‘సాహో’ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ముమ్మరం చేసింది.

అనుకున్న సమయానికి వస్తుందా…?

నిజానికి ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదల అవ్వాలి కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రమోషన్స్ ఆషామాషీగా చేస్తే సరిపోదు. టీం దేశం మొత్తం తిరిగి రావాలి. పైగా ప్రమోషన్స్ అని ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు టీం. చేతిలో ఉన్న సమయం కేవలం మూడున్నర నెలలు. రీసెంట్ గా ‘సాహో’కి సంబంధించి రెండు మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేసారు అంతే. ప్రమోషన్స్ కోసం రెండు నెలలు అయినా టైం కావాలి. టీం మొత్తం గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం ప్రతి ఒక్కరు రెస్ట్ లేకుండా ఉరుకులు పరుగులు మీద పని చేయాల్సిందే. అప్పుడే అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయొచ్చు. లేకపోతే కష్టమే.

Tags:    

Similar News