ఫారిన్ షూటింగ్స్ కి కొత్త సమస్యలు..!

Update: 2018-09-12 08:01 GMT

నిన్నగాక మొన్న దుబాయ్ లోని అబుదాబిలో ప్రభాస్ - సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న సాహో సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడానికి దుబాయ్ ప్రభుత్వం అనుమతి తీసుకోవడానికి సాహో టీంకి రెండు నెలల సమయం పట్టింది. వీసాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు... ఆయా దేశాల నిబంధనల విషయంలో ఇదివరికటిలా... సినిమా షూటింగ్స్ కి ఇతర దేశాల్లో అనుమతులు అంత సులువుగా దొరకడం లేదు. సాహో కోసం దుబాయ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని మరీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కే ముందు అనుమతుల విషయంలో జాప్యం జరిగి సినిమా షూటింగ్ రెండు నెలలు వాయిదా పడింది. ఇక దుబాయ్ ప్రభుత్వ అనుమతులతో ఈమధ్యనే అబుదాబి లో సాహోకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ కి తిరిగొచ్చింది సాహో టీం.

మహర్షి సినిమాకీ అదే సమస్య...

ఇక తాజాగా ఈ ఫారిన్ షూటింగ్ తలనొప్పులు మహెష్ మహర్షి టీంకి కూడా ఎదురయ్యాయి. ఆరు నెలల ముందే మహర్షి సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి అమెరికాకి వెళ్లి అక్కడ న్యూయార్క్ లోని లొకేషన్స్ ని సెట్ చేసుకుని మరీ సినిమాని పట్టాలెక్కించాడు. కథలో భాగంగా చాలా కీలకమైన షెడ్యూల్ అమెరికాలో తీయాల్సి ఉండగా... ఇప్పుడు మహర్షి టీం అమెరికా వెళ్లేందుకు పర్మీషన్స్ రావడం లేట్ అవుతోంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే మహేష్ తో పాటు మహర్షి టీం మొత్తం నిన్ననే అమెరికా బయలుదేరాలి. కానీ పర్మిషన్స్ రావడం లేట్ అవడంతో.. ఇప్పుడు ఆ ఫారిన్ షెడ్యూల్ ని ఇంకొద్ది రోజులు వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

మరి చిన్న సినిమాల పరిస్థితి..?

మరి అసలే రెండు మూడు నెలలు లేట్ గా స్టార్ట్ అయిన మహర్షి షూటింగ్ ఇప్పుడు ఫారిన్ షూటింగ్ కి అనుమతులు లేట్ కావడంతో.. సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకు మహర్షి షూటింగ్ ని పరిగెత్తించిన వంశీ పైడిపల్లి... ఫారిన్ షూటింగ్ కి లేట్ అయినప్పటికీ హైదరాబాద్ లో ఉన్న బ్యాలెన్స్ షెడ్యూల్ ని పూర్తి చేసే ప్లాన్ లో వంశీ పైడిపల్లి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకే ఇంతగా అనుమతుల కోసం ఇబ్బందులు పడుతుంటే.. చిన్న సినిమాలు విషయంలో ఇంకెన్ని ఇబ్బందులు పడాలో కదా. పూజ హెగ్డే నటిస్తున్న మహర్షి మూవీ ఏప్రిల్ 5న విడుదలకు ప్లాన్ చేశారు నిర్మాతలు.

Similar News