థియేటర్స్ లోనే కాదు.. ఇక్కడా ప్లాప్ అయ్యిందా ప్రభాస్!!

బాహబలి క్రేజ్ తర్వాత ప్రభాస్ భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీ సాహో చేసాడు. బాహుబలి అంచనాలను సాహో తో ప్రభాస్ అందుకోలేకపోయారు. హాలీవుడ్ స్టాండెడ్స్ తో [more]

Update: 2020-10-30 08:55 GMT

బాహబలి క్రేజ్ తర్వాత ప్రభాస్ భారీ బడ్జెట్ తో యాక్షన్ మూవీ సాహో చేసాడు. బాహుబలి అంచనాలను సాహో తో ప్రభాస్ అందుకోలేకపోయారు. హాలీవుడ్ స్టాండెడ్స్ తో తెరకేకించిన సాహో ఏ భాషా ప్రేక్షకులను శాటిస్ఫాయ్ చెయ్యకపోయినా.. యాక్షన్ అంటే ప్రాణం పెట్టె బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆదరించారు. సాహో సినిమా తో ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు.. ఆయన క్రేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అయితే ప్రభాస్ సాహో కోట్లలో కొల్లగొడుతుంది అనుకుంటే.. కంటెంట్ పరంగా సినిమా బాగా దెబ్బేసింది. థియేటర్స్ లో సాహో ప్లాప్ అయ్యింది.

అక్కడ థియేటర్స్ లోనే కాదు.. బుల్లితెర మీద సాహో అట్టర్ ప్లాప్ అయ్యింది. సాహో విడుదలైన ఏడాది తర్వాత సాహో శాటిలైట్ హక్కులు కొన్న జీ తెలుగు సాహో సినిమా ని ప్రసారం చేసింది. అయితే సాహో కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారు అనే విషయం సాహో టీఆర్పీ తో తేలిపోయింది. సాహో సినిమా నచ్చకపోయినా లాక్ డౌన్ వలన అమెజాన్ ప్రైమ్ లోనే చాలామంది వీక్షించేసిన తర్వాత జీ ఛానల్ వరల్డ్ టెలివిసన్ ప్రీమియర్ అంటూ హడావిడిచేసినా సాహో సినిమా ని బుల్లితెర ప్రేక్షకులు రిజెక్ట్ చేసారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఏ సినిమాకి రాని ఘోరమైన టీఆర్పీ సాహో కి వచ్చింది. ఈ సినిమాకి కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్ మాత్రమే రావడం అందరికి షాకిచ్చింది.

Tags:    

Similar News