రాజ్ తరుణ్ సరసన ఫ్లాప్ హీరోయిన్

యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస వైఫల్యాలతో మరో సినిమాని మొదలు పెట్టడానికి భారీ గ్యాప్ తీసుకున్నాడు. గత ఏడాది రంగుల రాట్నం, లవర్ డిజాస్టర్స్ తో [more]

Update: 2019-03-20 07:35 GMT

యంగ్ హీరో రాజ్ తరుణ్ వరుస వైఫల్యాలతో మరో సినిమాని మొదలు పెట్టడానికి భారీ గ్యాప్ తీసుకున్నాడు. గత ఏడాది రంగుల రాట్నం, లవర్ డిజాస్టర్స్ తో ఉన్న రాజ్ తరుణ్ తాజాగా ఇప్పుడు మరో కొత్త సినిమాని దిల్ రాజు బ్యానర్ లో మొదలు పెట్టబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ‘అడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి ‘నీది నాది ఒకటే లోకం’ టైటిల్ ని పెడుతున్నారని, ఇప్పటికే ఈ టైటిల్ రిజిస్టేషన్ జరిగిందని అంటున్నారు. అయితే ఫ్లాప్స్ లో కొట్టుమిట్టాడుతున్న ఈ ఫ్లాప్ హీరో రాజ్ తరుణ్ సరసన మరో ఫ్లాప్ హీరోయిన్ నటిస్తుందని చెబుతున్నారు.

రాజ్ తరుణ్ సినిమాలో…

నితిన్ తో రెండు సినిమాలు చేసి డిజాస్టర్స్ కొట్టిన మేఘ ఆకాష్.. రాజ్ తరుణ్ కి జోడిగా ఎంపికైందనే న్యూస్ నడుస్తుంది. నితిన్ తో లై, ఛల్ మోహన రంగ సినిమాలు చేసినా ఈ బ్యూటీకి హిట్ పడలేదు. అమ్మాయి బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది కానీ ఏం లాభం.. లాక్కు లేదు. తాజాగా మేఘ ఆకాష్ నటించిన ‘చిత్రలహరి’ వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఇంకా ఈ హీరోయిన్ తెలుగులోనే కాదు.. తమిళంలోనూ హిట్ కొట్టలేకపోయింది. మరి ‘చిత్రలహరి’తో బోణి చేస్తుందో లేదంటే లేదో చూడాలి. ఇక రాజ్ తరుణ్ సరసన మేఘ అయితే బాగుంటుందని.. అందుకే మేఘ ఆకాష్ ని దర్శకనిర్మాతలు సంప్రదించినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మీద అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Tags:    

Similar News