విజ‌య్ దేవ‌ర‌కొండ‌’వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’

సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్నచిత్రానికి [more]

Update: 2019-09-17 08:54 GMT

సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్నచిత్రానికి 'వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా అయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

20న ఫస్ట్ లుక్….

డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ సెన్సిబుల్ క‌థాంశంతో ఈ చిత్రాన్నిఅద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతుంది. సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన మేక‌ర్స్ సెప్టెంబ‌ర్ 20, సాయంత్రం 5 గంట‌ల‌కు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయనున్నారు. ప్రస్తుతం సినిమా హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నేషన‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

 

Tags:    

Similar News