హిట్ అయితే తప్పుకుంటాం... లేదంటే వచ్చేస్తాం..!

Update: 2018-11-28 08:42 GMT

మరికొన్ని గంటల్లో విడుదల కాబోయే రోబో 2.ఓ సినిమా విషయంలో మిగతా సినిమాల నిర్మాతలు మనసులో మాట ఇది. 2.ఓ హిట్ అయితే కాస్త వెయిట్ చేస్తాం లేదంటే వచ్చేస్తామంటున్నారు వారు. రేపు విడుదల కాబోతున్న 2.ఓ సినిమాకి భయపడి రేపు అయితే ఏ సినిమా బరిలో నిలవడం లేదు కానీ.. వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 7న మాత్రం చాలా సినిమాలు విడుదలకు పోటీ పడుతున్నాయి. 2.ఓ సినిమా ప్రభంజనం మాములుగా రాలేదు. సినిమా ఓపెనింగ్స్ తోనే భారీగా రాబట్టాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. భారీ క్రేజ్, భారీ అంచనాలున్న 2.ఓ సినిమా రేపు భారీగా విడుదవుతుంది.

డిసెంబర్ 7న పోటీపోటీగా విడుదల

అయితే ఈవారం 2.ఓ కి ఏ సినిమా పోటీ రావడం లేదు. రామ్ గోపాల్ వర్మ ఎచ్చులు పోతూ రేపు 2.ఓ కి పోటీగా తన సినిమా భైరవగీతని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం, 2.ఓ మీద నెగెటివ్ కామెంట్స్ చెయ్యడం చేసాడు. కానీ వర్మ పొగరు సెన్సార్ వారు అణిచేసారు. భైరవ గీతకి సెన్సార్ వారు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపడంతో.. తన సినిమాకు సెన్సార్ వారు సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా డిసెంబర్ 7 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే డిసెంబర్ 7న బెల్లంకొండ శ్రీనివాస్ కవచంతో పాటుగా... సుమంత్ సుబ్రమణ్యపురం, హుషారు, సందీప్ కిషన్, తమన్నా నెక్స్ట్ ఏంటి ఇలా చాలా సినిమాలు లైన్ కొచ్చేశాయి.

హిట్ అయితే వాయిదానే...

అయితే 2.ఓ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు విడుదలవుతుంది. భారీ గ్రాఫిక్స్ తప్ప సినిమాలో ఏం లేదు... అందుకే ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా కనబడడంతోనే... ఇలా చాలామంది నిర్మాతలు నెక్స్ట్ వీక్ తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ 2.ఓ సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే.. తమ సినిమాలను మరో వారం వాయిదా వేద్దామని ప్లాన్ తో డిసెంబర్ 7 డేట్ ని లాక్ చేశాయి. మరి 2.ఓ హిట్ అయితే ఆగుతాం, లేదంటే వచ్చేస్తాం అన్నట్టుగా ఉంది డిసెంబర్ 7 విడుదలయ్యే సినిమాల పరిస్థితి.

Similar News