ఎలక్షన్స్ vs సినిమా..!

Update: 2018-12-04 06:19 GMT

ఈ శుక్రవారం ఒక పక్క ఎన్నికలు, మరోపక్క సినిమాల హడావిడి ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హీట్ మాములుగా లేదు. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఇక ఈ శుక్రవారం ఎప్పటిలాగే నాలుగైదు సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. ఈ వారం విడుదలైన రజినీకాంత్ 2.ఓ సూపర్ హిట్ అయితే వాయిదా వేద్దామనుకున్న సినిమాలు.. 2.ఓ కి యావరేజ్ టాక్ పడగానే భయం లేకుండా విడుదల సిద్దమయ్యాయి. మరోపక్క శుక్రవారం విడుదల కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ - కాజల్ - మెహ్రీన్ ల కవచం సినిమా ఆడియో లాంచ్ ఆదివారం జరగగా... సుమంత్ - ఈషా రెబ్బల సుబ్రమణ్యపురం నిన్న రాత్రి ఆడియో వేడుక జరుపుకుంది. ఇక తమన్నా - సందీప్ కిషన్ ల నెక్స్ట్ నువ్వే ఈ రోజు అడియో వేడుకని జరుపుకోబోతుంది. హుషారు, శుభలేఖలు సినిమాల హడావిడే కనిపించడం లేదు.

ఎన్నికల రోజు ఏం జరుగుతుంది ?

మరి రాజకీయాలు, ఎలక్షన్స్ అంటూ రాజకీయ నేతల హడావిడి వాళ్లది.. ఇక్కడ సినిమాల విడుదల హడావిడి సినిమా వాళ్లది అన్నట్టుగా ఉంది వ్యవహారం. మరి ఓటు ఓటే.. సినిమాలు సినిమాలే అన్నట్టుగా అనుకుంటున్నారు. చూద్దాం ఎలక్షన్స్ డే రోజున ధైర్యంగా బరిలోకి దిగుతున్న సినిమాల ఫైనల్ రిజెల్ట్ ఏమిటి అనేది.

Similar News