పూరి ఫైటర్ స్టోరీ అదేనా?

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న ఫైటర్(వర్కింగ్ టైటిల్) సినిమా ముంబై పరిసర ప్రాంతాల్లో ఓ నలభై శాతం షూటింగ్ జరుపుకున్నాక కరోనా లాక్ [more]

Update: 2020-04-22 01:54 GMT

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న ఫైటర్(వర్కింగ్ టైటిల్) సినిమా ముంబై పరిసర ప్రాంతాల్లో ఓ నలభై శాతం షూటింగ్ జరుపుకున్నాక కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమాని పాన్ ఇండియా గా మార్చాక పూరి తన కథలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసాడు. ఛార్మి – పూరి – కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫైటర్ లో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించాడనికి తగిన శిక్షణ కూడా తీసుకున్నాడు.

అయితే తాజాగా ఫైటర్ కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియా కథనం ప్రకారం ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ డాన్ కొడుకుగా కనిపిస్తాడని, డాన్ కి విజయ్ కి మధ్య కథ తిరుగుతుంది అని చెప్పడమే కాదు… విజయ్ దేవరకొండ డాన్ కొడుకుగా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఓ 15 నిమిషాల పాటూ కనిపిస్తాడని, ఆ తర్వాత చాలా టైం తండ్రి అయిన డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంటాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి పూరి జగన్నాధ్ ఇలాంటి కథలకు పర్ఫెక్ట్ డైరెక్టర్. అందుకే విజయ్ కూడా ఈ కథ నచ్చి పాన్ ఇండియాగా మార్చాడేమో అంటున్నారు.

Tags:    

Similar News