రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది

డెబ్యూ హీరోయిన్ కి లక్కీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆమె జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు సినిమా సక్సెస్ అవడమే కాదు.. ఆ [more]

Update: 2021-03-16 13:35 GMT

డెబ్యూ హీరోయిన్ కి లక్కీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆమె జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు సినిమా సక్సెస్ అవడమే కాదు.. ఆ సినిమా విడుదలకు ముందు నుండే జాతి రత్నాల ప్రమోషన్స్ లో ఫరియా డాన్స్, ఆమె లుక్స్ చూసిన హీరోలు ఆమెకి ఆఫర్స్ ఇవ్వబోతున్నారనే టాక్ మొదలైంది. అందులోనూ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కి అవకాశాల వెల్లువ మొదలైనట్టుగా చెబుతున్నారు. హైట్ ఎక్కువగా ఉన్న.. ఫరియాని నాగ్ అశ్విన్ ఓ కాలేజ్ ఈవెంట్ లో చూసి జాతి రత్నాల ఆఫర్ ఇచ్చాడట. ఇప్పుడా సినిమా హిట్. పాపకి అదృష్టం అలా కలసి రాగా.. ఇప్పుడు రవితేజ సినిమాలో ఫరియా అబ్దుల్లా అవకాశం కొట్టేసిందట. రవితేజ ప్రస్తుతం ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. తదుపరి కిషోర్ తిరుమల తో చెయ్యబోయే సినిమాలో రవితేజకి జోడిగా ఫరియా అబ్దుల్లాని మేకర్స్ అప్రోచ్ అవడం పాప ఓకె చెప్పడం జరిగింది అనే టాక్ ప్రచారంలోకొచ్చింది.

Tags:    

Similar News